హైదరాబాద్: గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తూ.. కేటాయింపులు చేస్తోంది. తాజాగా ‘సేతు బంధన్’ పథకం కింద రూ. 103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది.తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
‘సేతుబంధన్’ పథకంలో భాగంగా సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఎఫ్) కింద రూ.103 కోట్ల పనులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆమోదం తెలిపింది. నల్గొండ జిల్లా పరిధిలో నార్కట్ పల్లి- మునుగోడు రైల్వే లైన్ లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.69 కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలోని రైల్వే లైన్ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం రూ.34 కోట్లు ఖర్చు చేయనుంది.ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. రవాణా మెరుగు పడటంతో పాటు.. రైల్వే ప్రమాదాలు తగ్గుముఖం పట్టనున్నాయి.