అమరావతికి, ఆంధ్రకు బుద్ధుడు అరిష్టం అని చారిత్రిక ఆధారాలతోనూ, ‘చదువు’ ఆధారంగానూ నేను రాసిన వ్యాసం ఈ వరకే పలువురిని ‘బుద్ధ మేధ’కు అతీతంగా ఆలోచింపజేస్తోంది. ఆ వ్యాసంలోని వాస్తవాలను సహించలేక బొర్రా గోవర్ధన్ దయనీయంగా తన ‘బుద్ధ మేధ’ను వెలిబుచ్చారు
బొర్రా గోవర్ధన్ వ్యాసాన్ని గమనిద్దాం
1. “భారత భూభాగంలో బుద్ధుడు అభివృద్ధికీ, ఐశ్వర్యానికీ, భద్రతకూ, వికాసానికి, సమైఖ్యతకు, ప్రశాంతతకూ ప్రతీక చిహ్నం కాలేదు. ప్రపంచంలో ఏ బౌద్ధ దేశమూ అభివృద్ధికరంగానూ, గొప్పగానూ లేదు” ఇదీ రోచిష్మాన్ అభిప్రాయం.
మహానాడు లో ఏపియల్ 4 న, ఇతని వ్యాసంలో బుద్ధుణ్ణి, అశోకుణ్ణి. అంబేద్కర్‌ని కించపరచారు…”
— ఇక్కడ ‘బుద్ధుణ్ణి, అశోకుణ్ణి. అంబేడ్కర్‌ని కించపరచారు’ అని గోవర్ధన్ అనడం పూర్తిగా అబద్ధం, దారుణం, దగుల్బాజీ తనం. నేను నా వ్యాసంలో బుద్ధుణ్ణి, అంబేడ్కర్‌ను ఎంత మాత్రమూ నిందించ లేదు. ఈ అబద్ధంతో బుద్ధ వాదుల్ని, అంబేడ్కర్ అనుయాయుల్ని నా మీదకు ఉసి గొలిపే నీచపు ప్రయత్నం గోవర్ధన్ చేశారు. ఇది గర్హనీయం. ఇది సత్యాలపై, సత్యాలను తెలియజేసే వ్యక్తులపై కమ్యూనిజమ్ మార్క్ దాడి.
ఇది బుద్ధ స్ఫూర్తి కాదు. బుద్ధుడి మౌలిక బోధనలకు వ్యతిరేకంగా. బుద్ధ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మాజీ కమ్యూనిస్టులు ప్రస్తుత బుద్ధిస్టులు ఎలా వాస్తవాలను వక్రీకరిస్తూంటారో గోవర్ధన్ తేట తెల్లంగా మరోసారి నిరూపించారు. నిజానికి అంబేడ్కర్ పరంగా నేను నా ఆవేదనను వ్యక్తం చేశాను.
అంతర్జాతీయ ఆధారాలతో అశోకుడి గురించి చెప్పాను. బుద్ధుడి గురించి అంతర్జాతీయమైన ‘చదువు’ ఉండి ఉంటే గోవర్ధన్ కూడా ఈ మాటలే చెప్పుండే వారు. ఆయనకు ఆ ‘చదువు’ లేకపోవడం కొన్నేళ్ల క్రితం ఆంధ్రజ్యోతిలోనూ, సోషల్ మీడిఅలోనూ తెలియజేశాను. చదువు లేకపోవడం వల్ల వచ్చిన ఆత్మ న్యూనతా భావంతో గోవర్ధన్ తన అబద్ధాలతో నాపైకి అంబేడ్కరిస్టుల్నో, బుద్ధిస్టుల్నో ఉసిగొలిపే ప్రయత్నం చేశారా? ఇలాంటి గోవర్ధన్ మాటలు అసహ్యకరం; ఈ అబద్ధాలు గోవర్ధన్ ఎలాంటి వ్యక్తో తెలియజేస్తున్నాయి; గోవర్ధన్ దిగజారుడుతనాన్ని పట్టిస్తున్నాయి.
2. “అది ఒక వ్యాసం అని.. దాన్లో విశేషం ఉందని ఎవ్వరూ అంగీకరించరు. ఆంధ్ర రాష్ట్రానికే ‘అమరావతి’ రాజధానిగా అంగీకరించటంలో తన అక్కసు వెళ్ళబుచ్చారు. రోచిష్మాన్ గారి అజ్ఞానం ఎంత గొప్పదో, వారి ఉటంకించిన సంఘటనే తెలియజేస్తాయి! అజ్ఞానం అజ్ఞానంగా ఉండేవారే చరిత్ర మీద ఏ కొంతైనా ఆలోచిస్తారు! ఇంత దిగజారుడు ఆలోచనలు అదరూ అసహించు కొంటారు. ఎద్దేవా చేస్తారు…”
–ఇది పూర్తిగా గోవర్ధన్ మార్క్ అజ్ఞానపు, అసంస్కారపు పేలాపన. నా వ్యాసం ఈ వరకే ఎంతో వ్యాపించింది; పలువురికి ఆలోచనాత్మకమైంది. ఎవరో ఎందుకు స్వయంగా గోవర్ధన్ నా వ్యాసానికి భయపడే కదా ప్రతిస్పందన రూపంలో తన అజ్ఞానాన్ని, అసంస్కారాన్ని వెలిబుచ్చుకున్నారు! హతవిధీ… ఈ కుహనా బుద్ధిస్టులకు మతి ఎందుకు సరిగ్గా పనిచెయ్యదో? నాకు అక్కసు అనడం గోవర్ధన్ మానసిక అపరిపక్వతను తెలియజేస్తోంది.
నాకు అక్కసు ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచనే ఉంటుంది. అసలు నేను ఆంధ్ర వాసినే కాను. నాకు ఈ విషయంగా అక్కసు, ఆత్రం, ‘బుద్ధిస్టులకు ఉండే లోపాయకారీ లబ్ది’ ఉండవు. ఈ సరైన చింతన, ఉండుంటే అంతర్జాతీయ అధ్యయనానికి, విచక్షణకు, బుద్ధుడికి వ్యతిరేకమైన రచనలు చేసి చేసి తన విదూషకత్వాన్ని. సనాతనంపై విద్వేషాన్ని గోవర్ధన్ ఇన్నేళ్లూ వెలిబుచ్చేవారే కాదు.
3. ఒకటి: బుద్ధుడు మంచోడు కాదు”
— అని నేను అన్నట్టు నీచంగా అబద్ధం చెప్పారు గోవర్ధన్. బుద్ధుడు మంచోడు కాదు అని నేను నా వ్యాసంలో ఎక్కడా అనలేదు. ఈ మాట గోవర్ధన్ చెడ్డతనాన్ని పట్టిస్తోంది. ఏ అశ్లీల శక్తుల్నో, ఏ అసభ్య జీవుల్నో నా మీదకు ఉసి గొల్పే ప్రయత్నం చేశాడు గోవర్ధన్.
4 రెండు: అశోకుడు మంచోడు కాదు.
ఇదే విషయాన్ని ప్రతి పేరాలో అదేపనిగా చెప్పారు. ఎవరన్నా వినకపోతే ‘నేను చెప్తున్నాను వినండి… వినండి” అంటూ శొద పెట్టారు. వారి వ్యాసంలోని విషయాల్ని పరిశీలిద్దాం
— అశోకుడి గురించి అంతర్జాతీయ అధ్యయనం ఏం చెప్పిందో వివరాలతో సహా నేను తెలియజేశాను. గోవర్ధన్‌కు ఆ చదువు ఎలాగూ లేదు సరే నేను చెప్పాక అయినా చదువు ఉన్న వాళ్లతో నా మాటల్ని సరిచూసుకుని ఉండాల్సింది. గోవర్ధన్‌కు సరిచూసుకోవడమే తెలుసుంటే బౌద్ధ పేలాపన చెయ్యడం ఎప్పుడో మానేసేవారేమో?
5. “…ముందుగా కనిష్కుని (క్రీ.శ.78 – క్రీ.శ.101) తర్వాత భారత దేశం ముక్కలైపోయింది అన్నారు. అది వారికే తెలియాలి. కనిష్కుడు కూడా బౌద్ధుదే…”
— కనిష్కుడి తరువాత భారత దేశం ముక్కలైపోయింది అని నేను అనలేదు. గోవర్ధన్‌కు నేను అననిది ఎలా తెలిసింది? ఆయనకు మానసిక సమస్య ఏమైనా ఉందా? కనిష్కుడు బుద్ధుడు కాడు. ఇది సరైన చరిత్ర. కనిష్కుడు ఇతర మతాలతో పాటు బౌద్ధాన్నీ ఆదరించాడు అంతే. కనిష్కుడి కాలానికి బౌద్ధ మతం అని ఉండుండదు.
6. “భారత దేశంపై బౌద్ధులు రాజుగా ఉన్నప్పుడు, పరాయదేశం వారు ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. అలాంటి చరిత్ర బౌద్ధులకు లేదు. అశోకుని కాలంలోగానీ, కనిష్కుని కాలంలోగానీ, హర్హుడు కాలంలోగానీ ఇలాంటి చరిత్ర”
— ఈ మాటలు గోవర్ధన్ చదువు లేమిని తెలియచేస్తున్నాయి. బౌద్ధం భారతదేశంలో నిర్మూలనమైంది ముస్లిమ్ దండయాత్రల వల్లే అని Geoffery Parrinder వంటి అంతర్జాతీయ అధ్యయనకారులు గట్టిగా తెలియచేస్తున్నారు. ఉదాహరణకు బక్తియర్ ఖిల్జీ బౌద్ధులైన పాల రాజుల్ని నిర్మూలించాడు. ఇలా మరి కొన్నీ… గోవర్ధన్‌కు Geoffery Parrinder పేరైనా తెలుసా?
7. “బాబర్‌ను భారత దేశానికి వచ్చి, ఆక్రమింపచేసిందీ రాజపుత్రులే, ఇబ్రహీంలోడికి అతని దాయాదితో విభేధాలు వచ్చాయి. అతన్ని, రాజపుత్ర రాజు రాణా సంఘ్ ఆశ్రయమిచ్చాడు. వీరిద్దరూ కలసి బాబర్ దగ్గరకు వెళ్ళారు. పాటిపట్టు దగ్గర యుద్ధం జరిగి ఇబ్రహీంలోడి ఓడిపోయాడు. బాబరు ఢిల్లీకి రాజయ్యాడు. 1517లో రాణాసంఘ్ బాబరు పై యుద్ధానికి మళ్ళీ వచ్చి తాను ఓడిపోయాడు. రాజపుత్ర రాజ్యం బాబరు వశమైంది. అలా బాబర్‌ను రప్పించింది రాజపుత్ర రాజులే!”
— బాబర్ కన్నా ముందే భారత భూభాగంపై ముస్లిమ్ దాడులు జరిగాయని, అప్పుడు కొన్ని ప్రాంతాల్లో బుద్ధ రాజులు ఉండే వారని గోవర్ధన్‌కు తెలియకపోవడం దయనీయం.
ఆయన్ను చూసి జాలిపడడం తప్పితే ఆయనకు మనం సాయం చెయ్యలేం; ఆయన్ను చూసి నవ్వుకుందాం.
8. “పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192) జయచంద్రుని కూతురైన సంయుక్తను పెళ్ళి చేసుకోవడం. అందులో సంయుక్త వరమాల ధరించి ఉండగా, పృద్వీరాజ్ ఏకమవుతారు. అతణ్ణి ఓడించడానికి జయచంద్రుడు ఘోరీ దగ్గరకు వెళ్తాడు. పృద్వీరాజ్ ను ఒడించిన తరువాత ఘోరీ తన బానిసకు (కుతుబుద్దీన్ ఐబక్ న్ను) ఢిల్లీ సింహాసనం అప్పచెప్పి వెళ్ళాడు. అతని కుమార్తె రజియా సుల్తానా.
ఇక్కడ కూడా ఘోరీని పిలిచింది మన భారతీయులే!”
– ఈ మాటలు సరిగ్గా గోవర్ధన్‌ను పట్టిస్తున్నాయి. గమనిద్దాం… ‘ఇక్కడ కూడా ఘోరీని పిలిచింది మన భారతీయులే!’ అని గోవర్ధన్ అనడం భారతీయులపై విద్వేషం. గోవర్ధన్ భారతీయుడు కాదా? బౌద్ధులు భారతీయులు కారా? ఈ సందర్భంలో నేను జయచంద్రుడిని ఎంత మాత్రమూ సమర్థించడం లేదు. కానీ ఆ జయచంద్రుడు ఇదిగో ఇప్పటి గోవర్ధన్‌లలో ఉన్నారేమో అని భయపడుతుంటాను, ఆవేదన చెందుతూంటాను. ఇంతకీ గోవర్ధన్ భారతీయుడు కాని బుద్ధీస్టా? భారతీయుడా? జయచంద్రుడులా బతుకుతున్న బుద్ధీస్టా?
9. “….ఇలాంటి ‘చౌకబారు’ యుద్ధాలు బౌద్ధులు ఎప్పుడూ చేయలేదు…”
– ఈ మాట అనే ముందు గోవర్ధన్ తన బుద్ధిస్ట్ గుర్తింపు గురించి ఆలోచించి ఉండాల్సింది. బుద్ధుడే స్వయంగా రాజ్యాన్ని, అధికారాన్ని వదులుకొన్న వాడు. బుద్ధుడు ఒక రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యని వాడు; రాజుస్థానాన్ని వదులుకొన్న వాడు. అటువంటి బుద్ధుడి అనుయాయులు రాజ్యాధికారాలు, యుద్ధాలు చెయ్యడం ఏమిటి? అది బుద్ధ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా? అసలు రాజ్యం, పాలన ఇవి బుద్ధుడు వద్దనుకున్నవి. అలాంటి బుద్ధుడి పేరుతో, ముద్రతో రాజ్యాధిపతి, పాలన ఉండడం బుద్ధ ద్రోహం. ఇది ఇంగితం; ఇది విచక్షణ.
10. “… అంబేడ్కర్ తొలి రోజుల్లోనే ఆరు లక్షల మందికీ, ఆ తర్వాత రెండు లక్షల మందికీ దీక్ష ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇంకా బాగుంటే ఎందరో బౌద్ధులు తయారయ్యేవారు. కుల భారతాన్ని కుళ్ళబొడిచేవారు…”
— ఇప్పడు భారతదేశంలో బౌద్ధం ఏ పరిస్థితిలో ఉంది? భిక్షాటన చేస్తూ ఉంది. ‘నాకు డబ్బులు ఇవ్వండి’ అని అడుక్కుంటూ ఉంది; విద్వేషవాదంతో ఆగం చేస్తోంది; అసభ్య పదజాలంతో, కులోన్మాదంతో సామాజిక సామరస్యానికి భంగంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ఇవాళ మనదేశంలో మాత్రమే వక్రీకరణలతో బౌద్ధం వికృతంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం అంబేడ్కర్ బౌద్ధాన్ని తీసుకోవడమేనా?
11. “రోచిష్మాన్ “భారత దేశంలో తొలి ‘మత నరమేథం’ అశోకుడు చేశాడు” అని మాట్లాడి అశోకుని పూర్వ చరిత్రను తీసుకువచ్చారు. అశోకుడు బౌద్ధుడు కాకముందు ఒక చరిత్ర, అశోకుడు బౌద్ధుడు అయ్యాక ఒక చరిత్ర, ఈ రెండింటి నడుమ ఒక గీత ఉంది. దీన్ని సరిగా అర్ధంచేసుకోవాలి. ఈ రచయిత అశోకుడు బౌద్ధుడు అవ్వకముందు చరిత్ర చూపుతున్నాడు…”
– గోవర్ధన్‌కు సరైన చదువు లేకపోవడమే మాత్రమే కాదు, ఎదురుగ్గా కనిపిస్తున్న నా వ్యాసం చదవడం కూడా చాతకావడం లేదు. నేను అశోకుడు బుద్ధ ఉపాసకుడు అయ్యాకే చేసిన దారుణాలను, ఘోరాలను అంతర్జాతీయ రచనలన్ను ఉటంకిస్తూ తెలియజేశాను. గోవర్ధన్ ఇకనైనా సరిగ్గా చదవడానికి, సరైన చదువుకు మాలిమి అవాలి. అశోకుడి గురించి గోవర్ధన్ తన వ్యాసంలో చెప్పినవి అంతర్జాతీయ అధ్యయనం కాదు. ఉదాహరణకు అశోకుడు తరువాత కుణాళడు రాజవలేదు. ‘అశోకుని తర్వాత కుణాళుడే రాజయ్యాడు’ అని అనడం గోవర్ధన్ అజ్ఞానం.
అశోకుడు తరువాత రాజు అశోకుడి మనుమడు దశరథుడు. ‘అశోకుడు బుద్ధ ఉపాసకుడు అయ్యాకే కళింగ యుద్ధం చేశాడు’ అన్నది సరైన, అంతర్జాతీయ అధ్యయనం. బుద్ధ ఉపాసకుడు అనడానికి, బౌద్ధుడు అనడానికి చాల తేడా ఉంటుంది. బహుశా ఆ తేడా గోవర్ధన్‌కు తెలిసుండే అవకాశం లేదు. గోవర్ధన్ తన వ్యాసంలో అశోకుడి పరంగా చెప్పినవి విషయాల వారిగా ఖండించ వచ్చు. అది ప్రస్తుతానికి అప్రస్తుతం కనుక నేను ఆ పని చెయ్యడం లేదు.
12 When ever I consider the physical land scape of humanity, the image Ashoka the great, India’s outstanding ancient sovereign comes inevitable to my mind” – అంటాడు జపాన్ బౌద్ధ తాత్త్వికుడు డైకె ఐకెతా”
— ఈ తాత్త్వికుడు డైకె ఐకెతా కాదు ‘డైసాకు ఐకేడా’. ఈ డైసాకు ఐకేడా సంస్థ ‘సోకా గక్కాయ్’ తో 2008 లోనే నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదో తెలిసినట్టు మాట్లాడడం కాదు. తెలివిడితో మాట్లాడాలి. కర్ణాకర్ణిగా వినిపించిన వాటితో పేలాపన చెయ్యడం కాదు first hand knowledge ఉండాలి. అబద్ధాలు, బుద్ధి మాంద్యం కాదు అంతర్జాతీయ అధ్యయనం, తెలివిడి కావాలి.
బ్రిటిష్ ప్రభుత్వం కాలం, స్వతంత్ర భారత తొలి దశ ప్రభుత్వం భారతీయతను, సనాతనాన్ని, నెమ్మది నెమ్మదిగా పలచబరిచే కుట్రలో భాగంగా బుద్ధుణ్ణి, అశోకుణ్ణి కట్టు కథలతో విశేషంగానూ, ఉన్నతంగానూ చూపించారు. ముస్లిమ్ పాలన కాలంలో అశోకుడికి, బుద్ధుడికి గణన లేనేలేదు. ఇది క్షేత్ర వాస్తవాన్ని తెలియజేస్తోంది. Fabricated facts and descriptions about Buddha and Ashoka have harmed India a lot.
13. ఆదిశంకరాచార్యుల పరంగా వారి కాలం దగ్గర నుండీ గోవర్ధన్ చెప్పింది పేలాపన మాత్రమే. లోగడ ఆదిశంకరుల గురించి నేను రాసిన వ్యాసాలలో గోవర్ధన్ పేలాపనలకు అతీతంగా ‘తెలివిడి’ అన్నది ఉంది.
ఆదిశంకరులకు బుద్ధుడి గురించి తెలిసే అవకాశం లేదు. శంకరుల రచనల్లో బుద్ధ ప్రస్తావన లేనేలేదు. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు బౌద్ధ ఖండన చేశారనడం సరికాదు. ఈ విషయంగా విపులంగా లోగడ నేను రాశాను.
14 బుద్ధుడు కుల నిర్మూనిర్మూలన వాది’
– ఈ గోవర్ధన్ మాటలు పూర్తిగా వక్రీకరణ బౌద్ధం; సంపూర్ణ అసత్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో బుద్ధుణ్ని కులవాదిని చేసేశాయి కొన్ని నీచ శక్తులు. 1940లలోనే ‘బుద్ధుడు కులవాది కాదు, బుద్ధుడి పరంగా కుల ప్రస్తావన లేదు’ అని విశ్వవ్యాప్తంగా A k Coomaraswamy, I B Horner వంటి అంతర్జాతీయ అధ్యయనకారులు, పరిశీలనకారులు ఘంటాపథంగా తెలియజేశారు. గోవర్ధన్ ఇకనైనా A k Coomaraswamy, I B Horner వంటి, ఇంకా నేను నా వ్యాసంలో ఇచ్చిన 15మంది చరిత్రకారులు బుద్ధుడు, బౌద్ధం గురించి చెప్పినవి చదివి ఆ ‘చదువు’తో తెలివిడి తెచ్చుకోవాలి.
15. “ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, సౌందర్యలహరి, ఇవ్వన్నీ శంకరాచార్య కృతులు…”
— ఈ మాటలు గోవర్ధన్ అజ్ఞానాన్ని, అసహ్యకరమైన విదూషకత్వాన్ని పట్టిస్తున్నాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు శంకరుల కృతులు కావు. అజ్ఞానం… అజ్ఞానం… గోవర్ధన్‌కు అజ్ఞానం బౌద్ధోన్మాదం వల్ల వచ్చిందా? లేదా అజ్ఞానం వల్ల గోవర్ధన్ బౌద్ధోన్మాద వాదం చేస్తున్నారా?
16. “బుద్ధుని చూడగానే…… గోచీగొంగడీ ఊడి పోయి, చేతికి ఏదినస్తే అది రాయకూడదు. మీరు చెప్పిన దేశాలన్నీ శ్రీలంక, కంబోడియా, యమన్నార్, థాయ్‌లాండ్ లా హెూర్, వియత్నాం, మంగోలియా, ఓబెట్, తైవాన్, చైనా, జపాన్, భూటాన్- ఇవ్వన్నీ బౌద్ధ దేశాలే. కానీ.. అవి పూర్తిగా బౌద్ధ దేశాలు కావు. మీరు వెప్పిన వాటిలో భూటాన్ ఒక్కటే బౌద్ధ దేశం”
– ఇది మతి చలించిన వాగుడు. నేను నా వ్యాసంలో ఉటంకించిన దేశాల్లో బౌద్ధం ఉన్న శాతం, ఇతర గణాంకాలు కూడా తెలియజేశాను. చదువును దెబ్బకొట్టాలని, ఏ పిచ్చ వాగుడో వాగ కూడదు. సంస్కారం హీనమైన పదజాలం వాడకూడదు. మన దేశంలో బౌద్ధులు కులోన్మాదులుగా ఉండడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూండడం వాళ్లకు చదువు లేకపోవడం వల్ల వచ్చిన, చాతకానితనంతో వచ్చిన, అక్కసుతో వచ్చిన, మానసిక రోగం కావచ్చు. అందుకే వాళ్లు ఈ గోవర్ధన్ లాగా చదువుపై దాడి చేస్తుంటారు.
గోవర్ధన్ నేను చెప్పని మాటలన్ని చెప్పానని చెప్పాడు. అది అతగాడి అసంస్కారం; బౌద్ధం అతగాడికి నేర్పిన విద్య. వాటిని నమ్మి ఈపాటికే కొన్ని నీచపు జన్మలు, వీధి జాగిలాలకు, బురద వరాహాలకు పుట్టిన కొన్ని వికృత జీవులు కామెంట్ల రూపంలో నాపై అసభ్య పదప్రయోగం చేసి ఉంటాయి.
నా వ్యాసంలోని విషయాల్ని ఖండించే సందర్భంలో నా మాటల్ని యథాతథంగా గోవర్ధన్ ఉటంకించలేదు. అది అతగాడి సంస్కార రాహిత్యం. లేదా అది అతడి ‘బౌద్ధ సంస్కారం’ అయుంటుంది.
ఈ గోవర్ధన్ వంటి వాళ్లు తమ ప్రవర్తనతో బుద్ధుణ్ణి మనదేశంలో పూర్తిగా చంపేస్తున్నారు. ఎవరికైనా చదువు కావాలి, అజ్ఞానం, ఉన్మాదం కావు.
“అప్పుడు ప్రపంచంలో 200 దేశాల్లో బౌద్ధం ఉంది” అన్నాడు గోవర్ధన్. అది ఎప్పుడు? అప్పుడు కాదు ఎప్పుడైనా ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయా? ఇప్పటికీ ప్రపంచంలో 200 దేశాలు లేవు. ఇదీ గోవర్ధన్ అజ్ఞానం. ఈ అజ్ఞానంతోనే గోవర్ధన్ ఇన్నాళ్లూ బౌద్ధ పేలాపన చేసేశాడు! హతవిధీ… అయ్యో…
‘బుద్ధ మేధ’కు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బుద్ధుడు, బౌద్ధం నుండి విముక్తం అవ్వాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధికారిక కార్యక్రమాల్లోనూ, ప్రభుత్వ ప్రదేశాల్లోనూ, అన్నింటానూ బుద్ధుడి ప్రతిమను తొలగించాలి. బుద్ధ రహితంగా సుభిక్షంగా, మంగళకరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపొందాలని మనసా, వాచా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా బుద్ధుడు పాలనాధికారులకు, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి వంటి ప్రధాన, కీలక వ్యక్తులకు, వాళ్ల కుటుంబాలకు తీవ్రమైన అరిష్టం. ఇది జ్యోతిష్యం కాదు. చారిత్రిక అవగాహన. బుద్ధుడి విషయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలి.

9444012279