సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..
కేదారేశ్వరపేట లో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చింది… పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 34, 35 వ డివిజన్ పరిధిలోని వెలగపూడి లక్ష్మణ దత్ పాఠశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.., శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు.
ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.. అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు… కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వీరమాచినేని కిరణ్, పైలా సురేష్, డాక్టర్ శ్రీలక్ష్మి..,, వెంకట రమణ, హరీష్ లతో పాటు సుజనా మిత్ర కోఆర్డినేటర్లు., 34,35,56 మండల అధ్యక్షులు మరియు 34వ డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ రుద్రపాటి వెంకటేష్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి. బొడ్డు నాగలక్ష్మి , టిడిపి 34వ డివిజన్ ప్రెసిడెంట్ అట్లూరి కొండలరావు. 34వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ ఆకుల రవిశంకర్, మాజీ కార్పొరేటర్ బుల్ల విజయ్ కుమార్ గారు , మరియు అన్నా క్యాంటీన్ చైర్మన్
-.నందకుమారి తదితరులు పాల్గొన్నారు..