– ఎండాడ హిల్స్‌లో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు
– ఏపీ ఐటీ రంగ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నేడు కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా, ప్రపంచ ఐటీ పటంలో ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎదుగుతోంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదల వెరసి.. విశాఖ నేడు దిగ్గజ ఐటీ సంస్థలకు చిరునామాగా మారుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ తన శాశ్వత క్యాంపస్‌ను ఎండాడ హిల్స్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, ఏపీ ఐటీ రంగ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయి.
ప్రస్తుతం వెయ్యి మందితో నడుస్తున్న తాత్కాలిక కార్యాలయం, త్వరలోనే వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే భారీ కేంద్రంగా మారబోతోంది. కేవలం 99 పైసలకే ఎకరా భూమి అన్న విప్లవాత్మక నిర్ణయం, ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న అచంచలమైన భరోసాకు నిదర్శనం. ఇది కేవలం రాయితీ మాత్రమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసిన బలమైన పునాది.
ఐటీ దిగ్గజ సంస్థలు కొలువుదీరడం అంటే, ఐటీ రంగంలో ఒక బలమైన ‘ఎకో సిస్టమ్’ సిద్ధమైనట్లే. ఈ మూడు ప్రధాన సంస్థల ద్వారానే సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. Church వంటి అంతర్జాతీయ దిగ్గజాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపడం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపార అనుభవం, మంత్రి లోకేశ్ పనితీరు కలగలిసి ఈ అద్భుతాన్ని సాకారం చేస్తున్నాయి. సత్వా, రహేజా వంటి ఐటీ పార్కులు అందుబాటులోకి వస్తే, వందలాది చిన్న స్థాయి (MSME) కంపెనీలు కూడా విశాఖను తమ కేంద్రంగా మార్చుకుంటాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చే రెండేళ్లలో విశాఖ రూపురేఖలు మారిపోవడమే కాకుండా, అది దక్షిణ భారతదేశానికే తలమానికంగా నిలవబోతోంది. దీనివల్ల నిన్నటి వరకు వలసల బాట పట్టిన ఉత్తరాంధ్ర యువత, నేడు సొంత గడ్డపైనే అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలను అందుకోబోతున్నారు.
అభివృద్ధి ఎలా పరిగెడుతుందో విశాఖే అందుకు ఉదాహరణ. గత పాలనలో కుదేలైన వ్యవస్థలను చక్కదిద్ది, మళ్లీ ప్రగతి చక్రాలను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు-లోకేశ్ జోడీ.. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఎప్పుడూ రేపటి తరం కోసమే ఉంటుంది. అందుకే ఆయన కేవలం ఐటీ రంగంతోనే ఆగకుండా, విశాఖను ‘వరల్డ్ ఏఐ క్యాపిటల్’గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు, డెవలప్మెంట్ సెంటర్లు ఒక్కచోట చేరితే, రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఐటీ సేవలందించే ప్రధాన కేంద్రంగా విశాఖ నిలవడం ఖాయం.