– జలరాశి తో కళకళలాడుతున్న బద్వేల్ చెరువులు
చంద్రబాబు రాగానే 2025లో నింపారు, 2026 నాటికి ఒక సంపూర్ణ విజయగాథగా మారింది. బ్రహ్మసాగరం జలకళను పులుముకోగా, కాలువలు గలగల పారుతూ చెరువులను నింపుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే, అన్నదాతల కళ్లలో ఆనందబాష్పాలు జలపాతాలై వర్షిస్తున్నాయి.
ఎప్పుడూ లేని విధంగా, బద్వేల్ డివిజన్లోని 168 చెరువుల్లో 161 చెరువులు ఏకంగా 100% నిండుకుండలా మారాయి! ఏ ఒక్క చెరువు కూడా ఖాళీగా లేదు. 36,695 ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు కరువు భయం లేదు, కేవలం పచ్చని పంటల భరోసా మాత్రమే ఉంది.
గత ప్రభుత్వ హయాంలో (జగన్ పాలనలో) పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉండేవి. వరదలు వచ్చినా, ప్రాజెక్టులు నిండక చెరువులు క్రికెట్ ఆడుకునేలా ఎండిపోయి ఉండేవని రైతులు ఆవేదన వ్యక్తం చేసేవారు. ముఖ్యంగా, వైఎస్ఆర్ గారు ప్రారంభించి అంకితం ఇచ్చిన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఏడేళ్లకే లీకేజీ సమస్యలతో సతమతమైంది.
ఆ లీకేజీకి మాట్లేయడం(మరమ్మతులకే) తప్ప అభివృద్ధికి జగన్ ప్రభుత్వంలో నోచుకోలేదు. నూతన జల ప్రాజెక్టుల ఊసే లేదు, ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు సైతం నిర్వహణ లోపంతో (గేటుకు గ్రీస్ కూడా పెట్టని నిర్లక్ష్యంతో) వరదలకు కొట్టుకుపోయింది. కడపకు తాగునీరు తెస్తామని చెప్పి, అమృత్ పథకం కింద రాష్ట్ర వాటా విడుదల చేయక, ఆ మాటలన్నీ నీటి మీద జగన్ రాతలు అయ్యాయి.
కానీ, 2024 నుండి గాలి తిరిగింది! వేయి టీఎంసీలకు పైగా నీటిని విడుదల చేయడం వల్ల బ్రహ్మసాగరం జలకళను సంతరించుకుంది. పర్యాటకులు రాకతో, మత్స్యకారుల ఉపాధితో ప్రాజెక్టు ప్రాంతం సందడిగా మారింది. నేడు 2026లో, బ్రహ్మసాగరం ప్రాజెక్టును సమర్థవంతంగా నింపి, కాలువల ద్వారా ప్రతి చెరువును జలసిరితో నింపుతున్నారు.
ఈ అద్భుతానికి పునాది ఎక్కడ పడింది?
ఈ జల విప్లవం వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. కరువు పీడిత రాయలసీమకు కృష్ణమ్మను తీసుకురావాలనే సంకల్పంతో పుట్టిన మహా యజ్ఞమే ‘తెలుగు గంగ ప్రాజెక్టు’. దీనికి దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు పునాది వేశారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా, కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పేరు మీదుగా నిర్మించిన ఈ రిజర్వాయర్, 1.9 కిలోమీటర్ల పొడవు, 27 మీటర్ల ఎత్తుతో దాదాపు 17.74 టీఎంసీల సామర్థ్యంతో నేడు మన రైతన్నల పాలిట వరప్రదాయినిగా నిలిచింది.
బ్రహ్మంసాగర్ నుండి ఆగస్టు 2025లో ప్రారంభమైన నీటి ప్రవాహం జీవనాడిలా మారింది. చెరువుల నిండుతనంలో ఏకంగా 70% బ్రహ్మసాగరం నీటి ద్వారానే సమకూరింది. బద్వేల్, పోరుమామిళ్ల వంటి భారీ చెరువులు సైతం నీటితో తొణికిసలాడుతుంటే, అప్పటి దూరదృష్టి, నేటి సమర్థవంతమైన నిర్వహణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రాజెక్టుల వారీగా జలసిరి:
TGP, CMP & SPVBR లెఫ్ట్ కెనాల్స్: 39 చెరువుల్లో 38 చెరువులు పూర్తిగా నిండాయి!
SPVBR కెనాల్ వ్యవస్థ: 83 చెరువుల్లో 78 చెరువులు వంద శాతం నిండుకుండలా మారాయి!
LSP కెనాల్ వ్యవస్థ: 46 చెరువుల్లో 45 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి!
వర్షాలు అదనం.. కెనాల్ నీరు ప్రాణం! గతంలో ఎన్నడూ లేని ఈ జలవైభవం, బద్వేల్ ప్రాంతాన్ని ఇకపై పసిడి పండించే హార్టికల్చర్ హబ్‌గా మార్చబోతోంది. చెరువులు నిండాయి.. రైతుల కష్టాలు తీరాయి.. అప్పటి ఆ దూరదృష్టికి, ఇప్పటి ఈ కృషితోడు కావడంతో బద్వేల్ ఇప్పుడు జలసిరితో తులతూగుతోంది. రైతన్నల ముఖాల్లోని ఈ చిరునవ్వులే, ఏ ప్రభుత్వానికైనా నిజమైన విజయ సంకేతాలు!