– ‘ముద్రా యోజన’ ద్వారా మోదీ అపారమైన అవకాశాలు
– మరోసారి పార్లమెంటులో మహిళా బిల్లు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ‘జాబ్ మేళా’ అభినందనీయం. ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది యువతకు ఉపాధి మార్గాలు దొరకడం సంతోషకరం. ఈ జాబ్ మేళాలో ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఫార్మసీ, పారా మెడికల్ వంటి వివిధ రంగాల నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు నేరుగా ఇక్కడే ఆఫర్ లెటర్లు అందజేయడం జరిగింది. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో వెతుక్కునే బదులు, ఇటు యువతకు, అటు కంపెనీలకు ఒకే వేదికపై పరిష్కారం లభించింది.
నేటి యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పబ్లిక్ సెక్టార్ మీదనే ఆధారపడకుండా, తమ ప్రతిభతో స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగ ప్రదాతలుగా మారాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్టార్టప్ ఇండియా’, ‘స్టాండప్ ఇండియా’ వంటి పథకాలతో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ముద్రా యోజన’ ద్వారా మోదీ ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పించింది.
ఉద్యోగాల కోసం వేచి చూసే స్థాయి నుంచి, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి దేశ యువతను ఎదిగేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ శోభా ఫౌండేషన్ వారు ఇటువంటి అర్థవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మరోసారి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, దానిని అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు.