తీన్ మార్ మల్లన్నేమో.. ’10 టీవీ’ నిధుల పురాణాన్ని విప్పుతున్నాడు. CPM వారు నాడు గుప్పెడు గుప్పెడు పోగుచేసిన విరాళాల్లోంచి, కొంత మొత్తాన్ని హైదరాబాద్ ప్రగతినగర్ రియల్ ఎస్టేట్ భాగోతాల్లోకి దారితప్పించారనే ఓపెన్ సీక్రెట్ అక్కడ పసిపిల్లవాడిని అడిగినా చెప్తాడు.
ఇక మన “కాక్రోచ్” తులసి చందు అక్క అయితే మరీనూ.. అమాయకంగా నోరుజారి చెప్పకనే చెప్పేసింది—మన ప్రో-నాకేశ్వర్ గారి నెలకు అక్షరాలా 10 లక్షల పైచిలుకు ‘మేధో సంపాదన’ గురించి!
సందేహం : మరి అంత సంపాదన పెట్టుకుని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాయాజాలంలో మన పులిహోర గారు అంతో ఇంతో పెట్టుబడి పెట్టకుండా సన్యాసం తీసుకుని ఉంటారా ఏంటి? అలాంటి మేధావిని పట్టుకుని “అమరావతి అభివృద్ధి చెందుతుంటే కాస్త సహనంతో చూడవయ్యా” అంటే ఎలా కుదురుతుంది? అమరావతి పెరిగితే హైదరాబాద్ పడిపోదూ?
చుక్కల భూముల రేట్లు కరిగిపోవూ?
నన్నేమన్నా అనండి భరిస్తా.. కానీ నా “అఖండ జ్ఞానాన్ని” వేలెత్తి చూపిస్తే మాత్రం నాలో ఉన్న కామ్రేడ్ కమ్యూనిస్ట్ ఉగ్రరూపం దాల్చుతాడు అంటాడు మన పులిహోర-డబ్బా నాకేశ్వర్.
పులిహోర గారి స్వయం ప్రకటిత “త్యాగాల” లిస్ట్!
(గమనిక: బ్యాక్‌గ్రౌండ్‌లో విప్లవ సంగీతం ఊహించుకోగలరు)
“కిరండల్ డివిజన్ కలపని వైజాగ్ రైల్వే జోన్ వేస్ట్ అని నేనే అడిగా! ONGC గ్యాస్ నిల్వలను వేదాంతాకు ఎందుకు ఇచ్చారని గర్జించింది నేనే! ఏపీకి హోదా ఏది? హక్కులు ఏవి? అని మైక్ విరిగిపోయేలా అడిగింది నేనే! అక్కడ లోకల్ పార్టీలు అడగవు.. ఎందుకంటే వాళ్ళకి నాకున్నంత ప్రజల పట్ల ‘నిబద్ధత’ లేదు. అందుకే నాపై వాళ్లకు అంత కోపం! అదీ అసలు మేటర్!”
— ఇలాగే సెలవిస్తుంటారు మన ప్రో-నాకేశ్వర్.
లెనిన్ కోట్స్.. పులిహోర గారి ట్విస్ట్‌లు!
మన కామ్రేడ్స్ అవసరాన్ని బట్టి లెనిన్ గారి కోట్లను ఎలా వాడుకుంటారంటే:
కోట్ 1: “ఉంటే అంతా ఉండాలి.. లేకుంటే అసలే వద్దు!” అనేది ఒక రకమైన వామపక్ష అతివాద బాలారిష్ట లక్షణం అన్నారు లెనిన్. (కానీ మన పులిహోర గారు మాత్రం ఏపీకి ఏ చిన్న సాయం వచ్చినా ‘అంతా వచ్చేదాకా ఇది ముట్టుకోవద్దు’ అని క్లాసులు పీకుతుంటారు).
కోట్ 2: “మేము సంస్కరణలకు వ్యతిరేకం కాదు.. కానీ సంస్కరణలే సర్వస్వం అని భ్రమింపజేస్తే విప్లవాత్మక డిమాండ్లను ముందుంచుతాం.”
నిజమే సార్! ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, ఆ పైన జగన్ గారి ‘విధ్వంసక ఐదేళ్ల పాలన’ పుణ్యమా అని.. ఏపీ పరిస్థితి ఇప్పుడు ఎండమావిలో చినుకు కోసం చూసే చకోర పక్షిలా తయారైంది. కేంద్రం నుండి ఏ కొద్దిపాటి అప్పు గ్యారెంటీనో, ప్యాకేజీనో వస్తే.. దాన్ని ఆసరాగా చేసుకుని బ్రతుకు జీవుడా అని ముందుకెళ్దాం అనుకుంటే.. మీ “విప్లవాత్మక డిమాండ్ల” తోటకూర కట్టలను అడ్డుపెట్టి ఆ మనుగడకే ఎసరు పెట్టమంటారా.. వీర విప్లవ వీరులారా?
పులిహోర గారి “త్రిశూల వ్యూహం”
ఆంధ్రాకి ఏదో ఒక రైల్వే జోన్ వస్తోంది కదా అని జనం కాస్త సంతోషపడే లోపే.. మన నాకేశ్వర్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి, “కిరండల్ డివిజన్ లేని జోన్ వస్తే ఎంత? రాకపోతే ఎంత? అసలు దాంతో లాభమేంటి?” అంటూ నీళ్ళు చల్లడం మొదలుపెడతారు. ఈ విశ్లేషణల వెనుక ఉన్న అసలు సీక్రెట్ టార్గెట్లు మూడు:
- సహాయ నిరాకరణ: కేంద్రం నుండి ఏపీకి ఆ మాత్రం సాయం అందడం కూడా వీరికి అస్సలు ఇష్టం లేదు.
- గతకాలపు మౌనం: జగన్ గారు ఐదేళ్లు ఒక్క పైసా సాధించకుండా చేతులెత్తేసిన రోజుల్లో ఈ పులిహోర గారి నోటికి ‘సైలెన్స్ మోడ్’ ఆక్టివేట్ అయి ఉండేది.
- ప్రాక్సీ వార్ : జగన్ తన కేసుల భయంతో కేంద్రం ముందు అడగలేని ‘విప్లవాత్మక డిమాండ్లను’.. ఈ మేధావుల నోటి గుండా ‘టోటల్ డిమాండ్ల’ రూపంలో బయటకు వదిలి రాజకీయం చేయడం.
అమరావతిపై చంద్రముఖి ప్రేయసి!
రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే అద్భుతమైన స్ట్రాటజీ! అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఏకైక పవిత్ర ఆశయంతోనే నాకేశ్వర్ లాంటి వారంతా అమరావతికి వ్యతిరేకంగా గొంతు చించుకుంటారు.
కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి అప్పు గ్యారెంటీ లభించినా.. “ప్రత్యేక హోదా ఏది? హక్కుగా రావాల్సిన నిధులు ఏవి? గ్రీన్ సిటీ నిధులు ఏవి? వీటితోనే తృప్తి పడిపోతారా?” అంటూ మైక్ పట్టుకుని వెంటపడతారు. మళ్ళీ అడిగితే.. “మీ ఊరి ప్రధాన పార్టీలు అడగనివి నేనే అడుగుతున్నాను.. అందుకే నా మీద పచ్చ జెండా వాళ్ళకి కోపం” అని సింప్లిసిటీ బోర్డు తిప్పేస్తారు!
జగన్ అనుకూల – బీజేపీ వ్యతిరేక “కామ్రేడ్” బంధం!
ఈ ధోరణి ఒక్క పులిహోరకే కాదు.. బీజేపీ వ్యతిరేక, జగన్ అనుకూల CPM మొదలుకొని అన్ని సదరు శక్తులకు ఇదొక కామన్ పాయింట్! కాకపోతే ఇక్కడ వైకాపా వారిది డబుల్ యాక్షన్ రోల్. కేసుల భయంతో తాము డైరెక్ట్‌గా అనలేని విషయాలన్నింటినీ.. ఇలాంటి CPM బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మేధావుల చేత అనిపించి, వెనుక కూర్చుని పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇది ఇద్దరికీ “ఉభయ కుశలోపరి” అన్నమాట!
లక్ష్యం 1: ఏపీలో ఎలాగైనా సరే అభివృద్ధిని, ముఖ్యంగా అమరావతి నిర్మాణాన్ని అడ్డగించడం.
లక్ష్యం 2: కేంద్రం నుండి లభించే కాస్తో కూస్తో సహకారాన్ని కూడా ‘పెద్ద డిమాండ్ల’ నెపంతో తక్కువ చేసి చూపించడం. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడం.
లక్ష్యం 3: ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే విఫలం చేసి.. మళ్లీ జగనన్నకు అధికార మార్గాన్ని రెడ్ కార్పెట్ వేసి సుగమం చేయడం!
చివరిగా ఒక చిన్న నోట్: మీ కరడుగట్టిన బీజేపీ వ్యతిరేకత, జగన్ అనుకూలతల ముసుగులో.. హక్కుల సంగతి దేవుడెరుగు, కనీసం మనుగడ సాగించడానికి దొరుకుతున్న చిన్నపాటి చేయూతను కూడా అందకుండా చేస్తామంటే ఎలా సార్? మీరు చెప్పే ‘ఆకాశంలో ఉన్న’ విప్లవాత్మక డిమాండ్లను తెచ్చి ముందర పడేసి, ఏపీని ఏమీ సాధించుకోలేని నిస్సహాయ స్థితికి నెట్టేయాలని చూస్తున్నారు.
విడిపోయి, సర్వస్వం కోల్పోయి దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని.. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టేసి శాశ్వతంగా చంపేయాలని చూస్తున్న మీ “మేధో-విప్లవ” పులిహోర ప్రయాసలను ఏపీ ప్రజలు ఇవాళ కాకపోయినా రేపైనా గుర్తించకుండా ఉంటారా.. ఓ వీర విప్లవ కామ్రేడ్లూ నాకేశ్వర్ జీ!?
(DRK గారి వ్రాతకి చాకిరేవు మెరుగులు)