-సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత మేకల సారంగపాణి డిమాండ్
సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్ఐఆర్ పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అవకతవకలు లేకుండా జవాబుదారితనంగా పనిచేయాలని ప్రభుత్వ అధికారులను కోరడం జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి, కంటెస్టెడ్ బిజెపి ఎమ్మెల్యే మేకల సారంగపాణి తెలిపారు.
డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని,చనిపోయిన వారిని గుర్తించి వాటిని తొలగించాలని అర్హులైన వారికి ఓటర్ జాబితాలో అవకాశం కల్పించాలని మేకల సారంగపాణి కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయము పరచుకుంటూ ఓటర్ సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అందరికీ అవగాహన కల్పిస్తూ అర్హుల అందరికి ఓటు హక్కు కల్పించాలని రెండు చోట్ల ఓట్లు గుర్తించి అలాగే మరణించిన వారిని గుర్తించి జాబితా నుండి తొలగించాలని సారంగపాణి అన్నారు. భారతీయ జనతాపార్టీ BLA 2 లు ప్రజలందరికీ మరియు అధికారులకు అందుబాటులో ఉంటారని అలాగే నియోజకవర్గం,డివిజన్ స్థాయిలో బీజేపీ నాయకులందరూ అందుబాటులో ఉంటారని, ఇప్పటికే వారికి అనేకసార్లు శిక్షణ ఇవ్వడం జరిగిందని, అధికారులతో కూడా సంప్రదింపులు జరిపామని మేకల సారంగపాణి తెలిపారు.
ప్రత్యేక సమావేశాన్ని సికింద్రాబాద్ నియోజకవర్గం చిలకలగూడా డివిజన్ బ్రాహ్మణబస్తీ నందు బిజెపి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2002 లో మరియు 2025లో ఓటు హక్కు కలిగి ఉన్న వారిని గుర్తించడం జరిగిందని ఇంకా పారదర్శకంగా ఓటర్ సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని అధికారులకు సహకరిస్తామని మేకల సారంగ పాణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కనకట్ల హరి, కందటి నాగేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ప్రభు గుప్తా అజయ్ నాయుడు, ప్రకాష్ గౌడ్,శారద మల్లేష్, అంబల రాజేశ్వరరావు, హనుమంతు ముదిరాజ్, నాగపురి శ్యామ్, ముఠా గణేష్, డివిజన్ అధ్యక్షులు ఇవి నరేష్, ఆదర్శ ముదిరాజ్, ఉపేందర్ యాదవ్, సాయి ప్రసాద్ గౌడ్, హంసరాజ్, రాజు ముదిరాజ్, నాగరాజ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.