September 24, 2026

రేవంత్ కుమార్తె నైమిషా రెడ్డి కొంపల్లి లో 150 కోట్ల విలువైన భూమిని 8b కోట్లకే కొన్నారు

  • ఇది మనీ లాండరింగ్ కాకపోతే మరేమిటి ?
  • లక్షా యాభై వేలకు గజం పలికే భూమిని రేవంత్ కుమార్తె 8 వేలకే ఎలా కొన్నారు?
  • రేవంత్ రెడ్డి అల్లుడు మెడికవర్ హాస్పిటల్స్ లో వాటాదారు
  • మెడికవర్ ఆస్పత్రి వాటాలు అమ్మిన వ్యవహారం పై విచారణ జరగాలి
  • రేవంత్ , ఆయన కుటుంబ సభ్యులకు 460 ఎకరాల భూమి
  • దానిపై కూడా అధికారుల కమిటీ విచారణ చేయాలి
  • రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పసుమాముల లో కబ్జా చేసిన భూముల పై అధికారుల కమిటీ విచారించాలి
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కు సంబంధించిన వ్యవహారం పై అధికారుల కమిటీ విచారించాలి
  • కేవలం 16 మందికే విచారణను పరిమితం చేయడం కుట్ర
  • అధికారుల కమిటీ కాదు అది తొండి కమిటీ
  • రేవంత్ రెడ్డి ని 50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్టీఫెన్ సన్ భూముల పై కూడా విచారణ కు ఆదేశించారు
  • స్టీఫెన్ సన్ ను బెదిరించడానికే ఆయన ఆస్తుల పై విచారణ కు ఆదేశించారు
  • బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన. కేసీఆర్ ,కేసీఆర్ కుటుంబం ,బీ ఆర్ ఎస్ నాయకుల మీద కక్ష పూరిత రాజకీయం నడుస్తోంది. కమిషన్లు , సిట్ లతో రేవంత్ పాలన సాగిస్తున్నారు. వివక్షాపూరిత ప్రతీకార పాలన లో భాగంగా తాజాగా జీవో 134 తెచ్చారు. అసెంబ్లీ లో 22 ఏ భూముల పై చర్చ తర్వాత, విచారణ కోసం జీవో 134 కింద కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణ ప్రజలను పీడిస్తున్న 22 ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రజల మధ్యకు వెళ్ళింది కే టీ ఆర్ ,హరీష్ రావు ,ఇతర బీ ఆర్ ఎస్ నాయకులే. ప్రజలిచ్చిన వేలాది ఫిర్యాదులతో అసెంబ్లీ కి వచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను సభకు రానివ్వలేదు. అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఆ ఒక్క రోజుకు కాదు మొత్తం సెషన్ కు సస్పెండ్ చేశారు. ఆ రోజు అసెంబ్లీకి రాని వారిని కూడా సస్పెండ్ చేశారు.

ఫుట్ బాల్ గ్రౌండ్ లో ప్రత్యర్థి టీం లేనట్టుగా, అధికార పక్షం అసెంబ్లీ లో బీ ఆర్ ఎస్ లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించింది. పొంగులేటి మూడున్నర గంటలు 22 ఏ పై మాట్లాడారు. అసెంబ్లీ లో అవకాశం రాకపోవడం తో మా నేత హరీష్ రావు తెలంగాణ భవన్ లో 22 ఏ పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఇపుడు జీవో 134 తో ఐ ఏ ఎస్ అధికారుల కమిటీ వేశారు. ఆ కమిటీ లో వివాదాస్పద అధికారి సందీప్ కుమార్ ఝా ఉన్నారు. విప్ ఆది శ్రీనివాస్ ను కూడా ఆయన అవమాన పరిచారు.

తమ భూములు ఆస్తులపై సుప్రీం కోర్టు లేదా హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కే టీ ఆర్ ,హరీష్ రావు కోరారు. జడ్జిలతో విచారణ జరిపితే తన బండారం బయట పడుతుందని రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలపై వేధింపు కమిటీ వేశారు. అధికారుల కమిటీ కాదు అది తొండి కమిటీ. విచారణ మార్గదర్శకాల్లో కేసీఆర్ అండ్ అదర్స్ ,అసోసియేట్స్ అని పేర్కొనడమే రేవంత్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. అదర్స్ ,అసోసియేట్స్ పేరుతో బీ ఆర్ ఎస్ నేతలపై వేధింపులకు హద్దు ఉంటుందా ?

రేవంత్ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. చివరకు రేవంత్ రెడ్డి ని 50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్టీఫెన్ సన్ భూముల పై కూడా విచారణ కు ఆదేశించారు. స్టీఫెన్ సన్ ను బెదిరించడానికే ఆయన ఆస్తుల పై విచారణ కు ఆదేశించారు. స్టీఫెన్ సన్ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయే ప్రమాదముంది.

కేవలం 16 మందికే విచారణను పరిమితం చేయడం కుట్ర.
తమ భుజాల మీద నుంచి బీ ఆర్ ఎస్ నేతలను కాల్చాలనుకుంటున్న రేవంత్ ట్రాప్ లో అధికారులు పడొద్దు. విచారణ పరిధిలో ప్రజల నుంచి పొంగులేటి రేవంత్ కుటుంబాల పై వచ్చిన ఫిర్యాదులను కూడా చేర్చాలి. 8 వేల కోట్ల విలువైన అసైన్ మెంట్ భూములు కొట్టేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కు సంబంధించిన వ్యవహారం పై అధికారుల కమిటీ విచారించాలి.

. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పసుమాముల లో కబ్జా చేసిన భూముల పై అధికారుల కమిటీ విచారించాలి. ఇబ్రహీం పట్నం రాందాస్ పల్లి భూముల కబ్జా పై అధికారుల కమిటీ విచారణ చేయాలి. ఖానామెట్ ,గచ్చి బౌలి డైమండ్ హిల్స్ ,శేరి లింగం పల్లి లో కాంగ్రెస్ నేతల భూ దందాలపై జీవో 134 కింద ఏర్పాటైన అధికారుల కమిటీ విచారించాలి.
ఫీనిక్స్ నుంచి రాత్రికి రాత్రే డెవెలప్ మెంట్ హక్కులు చేజిక్కించుకున్న పొంగులేటి కి చెందిన రాఘవ డెవెలపర్స్ పై అధికారుల కమిటీ విచారణ జరపాలి. వట్టి నాగుల పల్లి లో పొంగులేటి భూ దందాలపై విచారణ కమిటీ దృష్టి సారించాలి. మాకందిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ,ఆయన కుటుంబ సభ్యులకు 460 ఎకరాల భూమి ఉంది ..దానిపై కూడా అధికారుల కమిటీ విచారణ చేయాలి.

కేసీఆర్ అండ్ అదర్స్ పేరిట రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది ప్రజలపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టేట్టు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాక్షాసానందానికి దళిత గిరిజనులు బలవుతున్నారు. టెనెన్సీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయల భూములను రేవంత్ కుటుంబం కొట్టేస్తోంది.

రేవంత్ కుటుంబ సభ్యులకు వేల కోట్ల ఆస్తులు జమవుతున్నాయి. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి కొంపల్లి లో 150 కోట్ల విలువైన భూమిని ఎనిమిది కోట్ల కే కొన్నారు .ఇది మనీ లాండరింగ్ కాక పోతే మరేమిటి ? లక్షా యాభై వేలకు గజం పలికే భూమిని రేవంత్ కుమార్తె 8 వేలకే ఎలా కొన్నారు? విచారణ జరగాల్సింది ఇలాంటి దందాలపై కదా? రేవంత్ రెడ్డి అల్లుడు మెడికవర్ హాస్పిటల్స్ లో వాటాదారు. రేవంత్ రెడ్డి మెడికవర్ ఆస్పత్రులు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి ..ఆదిలాబాద్ రిమ్స్ లో మాత్రం చిన్నారులు ఐదుగురు బలయ్యారు. మెడికవర్ ఆస్పత్రి వాటాలు అమ్మిన వ్యవహారం పై విచారణ జరగాలి.

హైదరాబాద్ చుట్టుపక్కలా 22 ఏ తో వేలాది మంది రైతులు భాధ పడుతున్నారు. ఆదిభట్ల లో ఫోర్జరీ సంతకాలతో కాంగ్రెస్ నేతలు వందల ఎకరాలు కబ్జా కు ప్రయత్నిస్తున్న తీరుతో రైతులు లబో దిబో మంటున్నారు. వీటిపై కూడా అధికారుల కమిటీ విచారణ జరపాలి. దేవసేన కమిటీ ఫోన్ నెంబర్ సహా తమ కార్యాలయ వివరాలు వెల్లడించాలి. బి ఆర్ ఎస్ నేతలకే విచారణ పరిమితి కాకూడదు. ప్రజలెవ్వరూ ఫిర్యాదులిచ్చినా విచారణ చేయాలి.

134 జీవో ద్వారా ఏర్పాటైన కమిటీ దారి తప్పకుండా బీ ఆర్ ఎస్ పోరాటం కొనసాగుతుంది. ఆ కమిటీ ముందు మాకు వచ్చిన సమాచారాన్ని పెడతాం. 134 జీవో పై ఇపుడే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన లేదు. ప్రజలకు కేసీఆర్ అంటే ఓ ఎమోషన్. కేసీఆర్ కేవలం బీ ఆర్ ఎస్ నాయకుడు కాదు .తెలంగాణ తెచ్చిన నేత.

గణేష్ నిమజ్జనం లో కేసీఆర్ పై ప్రజలు ప్రేమ తో పాటలు పెట్టుకుంటే తప్పేమిటి ? రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు? ప్రజలకు రేవంత్ రెడ్డి అంటే ప్రేమ లేదు కనుక ఆయన పాటలు పెట్టుకోవడం లేదు. కేసీఆర్ పై ప్రజలు చాటుకుంటున్న అభిమానం పై ఆంక్షలు సబబు కాదు.

సజ్జనార్ ఆదేశాలు చట్టబద్దం కావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో తన సొంత పాటలు పెట్టుకోవడం చట్ట విరుద్ధం. పారడైజ్ సినిమా లో ప్రియదర్శి కేసీఆర్ ను పోలిన పాత్రకు విశేష స్పందన వ్యక్తమవుతోంది .ఇది కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకున్న ప్రేమ కు నిదర్శనం.

ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్ ,బీ ఆర్ ఎస్ నేతలు అభిలాష్ రంగినేని ,కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ ,మంద శ్యామ్ పాల్గొన్నారు.

Total Visitors: 2,764,050