బొద్దింకల తెలివి తెల్లారిందా?

ఈ బొద్దింక డిప్కే తెలివి లెవెల్ చూడండి
ఈసీ వివాదం మీద ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ వచ్చాక ఓట్లు చోరీ జరిగి బిజెపి గెలుస్తోంది అని ఆరోపణలు చేయడానికి ఈ బొద్దింక ఒక భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు.
బొద్దింకల ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే పోలో మంటూ వచ్చేసే మీడియా వాళ్ళు వచ్చేసారు.
ఆ ప్రెస్సర్ లో డిపీకే మాట్లాడుతూ హర్యానా, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో జ్ఞానేశ్ కుమార్ వచ్చాక ఓట్ల మతలబు ఎలా జరిగింది, జ్ఞానేష్ కుమార్ వల్ల ఓట్లు శాతం ఎలా తారుమారు అయి బిజెపి ఈ మూడు రాష్ట్రాలు ఎలా గెలిచిందో ఓట్ శాతం లెక్కలతో సహా డీప్కే చెప్పేసాడు. మంచిదే.
కానీ, జోక్ ఏమిటంటే..
హర్యానాలో అక్టోబర్ 2024లో,మహారాష్ట్రలో నవంబర్ 2024లో. ఢిల్లీలో 5 ఫిబ్రవరి 2025న ఎన్నికలు జరిగాయి.
జ్ఞానేష్ కుమార్ 19 ఫిబ్రవరి 2025న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అంటే, ఆయన సీఈసీ గా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలూ జరిగాయి.
ఒక ముఖ్యమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు తాము చెప్పే మేటర్ నిజమా కాదా అని చెక్ చేసే కనీస బాధ్యత తీసుకొనని ఈ అజెండా బొద్దింకలు ఈ దేశ యువతకు మార్గదర్శనం చేస్తారుట.
ఇంత బాధ్యతా రాహిత్యంగా ఉన్న బొద్దింకలను వెనకేసుకు వస్తున్న మేధావులను చూస్తే భయం వేస్తోంది.
ఇంకా దారుణం ఏమిటంటే.. మోడీ కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీడియా వాళ్లకు, ఈ ప్రెస్ మీట్లో చెప్పిన దారుణమైన అబద్దాలపై తిరిగి డీప్కే ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయారు.
- చాడా శాస్త్రి
