బీజేపీ కి సీ ఈ సీ ఊడిగం చేస్తోంది

- దేశ జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
- జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
- బీ ఆర్ ఎస్ గెలిచిన నియోజక వర్గాల్లో ఓట్లను అత్యధికంగా తొలగించడం పెద్ద కుట్ర
- బీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్ది రాజు రవిచంద్ర, మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు
హైదరాబాద్: దేశంలో జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలని బీ ఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్నది. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఒక పార్టీ కి ఊడిగం చేస్తోంది. 14 సార్లు సీ ఈ సీ నిర్ణయాల తో సహా కమిషనర్లు విభేదించారు. బీ జే పీ వ్యతిరేక ఓట్ల ను కావాలనే తొలగిస్తున్నారు. రాష్ట్రం లో సర్ పేరిట 95 లక్షల ఓట్లు తొలగించారు. బీజేపీ కి సీ ఈ సీ అనుబంధంగా మారిపోయారు.
సీ ఈ సీ ఓ ప్రైవేటు సంస్ధ ను పెట్టుకుని ఓట్లను విచ్చలవిడిగా తొలగించారు. ఓ వ్యక్తికి దేశంలో ఒకే ఓటు ఉండాలని బీ ఆర్ ఎస్, సీ ఈ సీ ని కోరినా ఆ సాఫ్ట్ వేర్ లేదని సమాధానమిచ్చారు. దీని బట్టే సీఈసీ పని తీరు ఎంత పేలవమో తెలుస్తోంది. తొలగించిన ఓటర్లు తర్వాత అర్హతలు చూపించినా తిరిగి జాబితా లో చేర్చకపోవడం ఏమిటి ? 13 కోట్ల ఓటర్లను జాబితాల నుంచి తీసేశారు.
రోగికి డాక్టరే విషమిచ్చి చంపినట్టు సీ ఈసీ దేశ పౌరులను ఓట్లకు దూరం చేశారు. దేశ జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి. తొలగించిన ఓటర్ల పై స్వంతత్ర విచారణ చేపట్టాలి. స్థానిక అధికారుల పాత్ర పై స్పష్టత ఇవ్వాలి. ఫారం 7 పేరిట చేస్తున్న దరఖాస్తుల పై విచారణ జరగాలి. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఏ నిర్ణయాలపై విభేదించారో వాటన్నిటిని బయట పెట్టాలి. ఈ వీ ఎం ల పై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలి.
కరీంనగర్ లో ఒక లక్షా ఆరు వేల ఓట్ల ను కరీం నగర్ లో తొలగించారు. నాకు కూడా నోటీసులు వచ్చాయి. చాలా మంది వివరణ ఇవ్వక ఓటు హక్కును కోల్పోయారు. ఓటు హక్కు తీసేసి బతికున్న మనుషులను తీసేశారు. బీజేపీ కి తొత్తుగా ఉన్న జ్ఞానేశ్వర్ కుమార్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలి.
ఓట్లు తొలగించడం వల్ల లాభ పడ్డది బీజేపీ మాత్రమే. మోడీ అమిత్ షా లతో సీ ఈ సి కుమ్మకై బీజేపీ ని పలు రాష్ట్రాల్లో గెలిపించారు. పశ్చిమ బెంగాల్లో ఈవీఎం లను అడ్డుపెట్టుకుని బీజేపీ గెలిచింది. బెంగాల్ లో ఎన్నికలు జరిగిన వెంటనే నాలుగు వేల ఈ వీ ఏం లను కాల్చివేయడం తో ఎన్నికల కమిషన్ కుట్ర బయట పడ్డది.
అత్యధికంగా తెలంగాణ లో 27 శాతం ఓట్లు తగ్గించారు. బీ ఆర్ ఎస్ గెలిచిన నియోజక వర్గాల్లో ఓట్లను అత్యధికంగా తొలగించడం పెద్ద కుట్ర. బీజేపీ యత్నాలకు ఇక్కడి కాంగ్రెస్ సహకరిస్తోంది. డిల్లీ లో కాంగ్రెస్ కొంతయినా పోరాడుతోంది. ఇక్కడ అది కూడా లేదు. జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించడమే కాదు ..అరెస్టు చేసి విచారణ చేయాలి. పండుగల దృష్ట్యా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం బూర్గుల రామకృష్ణా రావు భవన్ దగ్గర రేపు బీ ఆర్ ఎస్ తల పెట్టిన ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. తెలంగాణ లో తొలగించిన 95 లక్షల ఓట్లను తిరిగి ఓటర్ల జాబితా లో చేర్చాలి. ఓట్లు చేర్చాలే కానీ తీసేయడం సిగ్గు చేటు. సీఈసీ ని కేవలం పదవి నుంచి తొలగించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఆయన తప్పిదాల పై కూడా విచారణ జరగాలి. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.
