రాహుల్ గాంధీ వల్ల నాకు ప్రాణ హాని

నాకు ప్రాణ హాని ఉంది… ఔను నాకు రాహుల్ గాంధీ నుంచి నాకు ప్రాణ హాని ఉంది. నాకే కాదు ఈ దేశంలోని ప్రతి హిందువుకు రాహుల్ గాంధీ వల్ల ప్రాణహాని ఉందేమో?
రాహుల్ గాంధీ మాటలు, ప్రవర్తన, పనితీరును బట్టి ఈ దేశ హిందూ పౌరుణ్ణి అయిన నాకు ప్రాణం భయం పట్టుకుంది! నాకు రాహుల్ గాంధీ వల్ల ప్రాణహాని ఉంది!!
రాజ్యాంగంపై, దేశంపై, ప్రజాస్వామ్యంపై, ప్రజలపై రాహుల్ గాంధీ దేశంలో నుండే యుద్ధం చేస్తున్నారు! రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోస్తాననంటూ, దేశ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, దేశ ప్రజా ప్రధాని మాన్య నరేంద్ర మోదీని అప్రజాస్వామికంగా తొలగించేందుకు రాహుల్ గాంధీ ప్రజా కంటక అల్లర్లు, దేశ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నాడు. రాహుల్ గాంధీ సృష్టిస్తున్న అల్లర్లు, ఆందోళనలు, అరాచకం వల్ల నా దైనందిన జీవనానికి, నా భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అంతేకాదు రాహుల్ గాంధీ దాష్టీకానికి దేశంలో ప్రశాంతత పోయినట్టుగా నా ప్రాణం కూడా పోతుందేమోనని భయం… భయం… మహా భయం వేస్తోంది.
ఈ దేశ హిందువుగా నేను రాహుల్ గాంధీ బాధితుణ్ణి. రాహుల్ గాంధీ దైనందిన ప్రవర్తన, మాటల వల్ల, దేశంపై, దేశ ప్రభుత్వంపై అతడి ఆగడాల వల్ల ఈ దేశ సాధారణ పౌరుణ్ణి అయిన నా ప్రాణాలకు ముప్పు కలుగుతున్న భయం, అభద్రతా భావం నాలో రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.
రాహుల్ గాంధీ… 100 ఎన్నికలు ఓడిపోయిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ… రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై, ప్రజలపై ప్రతిపక్ష నాయకుడి హోదాలో దాడి చేస్తున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చేస్తున్న ఆ దాడిలో నా ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది.
100 ఎన్నికలు ఓడిపోయిన భంగపాటుతో, విపరీతమైన వైఫల్యం వల్ల పుట్టిన ఉన్మాదంతో, నిస్పృహతో, నిరాశతో, ఇక ఎప్పటికీ ప్రజలు తనకు అధికారం ఇవ్వరని తెలిసిపోవడంతో రాహుల్ గాంధీ మానసికంగా దెబ్బతిన్నారేమో? అతడి ప్రవర్తన, మాటలు అతడు మానసికంగా దెబ్బతిన్నార ని తెలియజేసెవిగానే ఉంటున్నాయి. అందుకే నాకు రాహుల్ గాంధీ అంటే భయం వేస్తోంది. రాహుల్ గాంధీ తీరు వల్ల నా ప్రాణాలకు ముప్పు కలుగుతుందని తీవ్రమైన భయం వేస్తోంది.
రాహుల్ గాంధీ ఏ రోజు ఏం చేస్తారో? ఎప్పుడు ఏ అరాచకం సృష్టిస్తారో అన్న భయంతో బతుకుతున్నాను నేను. రాహుల్ గాంధీ సృష్టిస్తున్న అరాచకాల్లో ఏదో విధంగా నా ప్రాణం పోతుందేమోనని నాకు భయం వేస్తోంది. రాహుల్ గాంధీ ప్రవర్తన వల్ల నాకు మరణం తప్పుదు అని భయం వేస్తూనే ఉంది. రాహుల్ గాంధీ నుంచి నా ప్రాణాలకు రక్షణ కావాలి; ఈ దేశ సామాన్య పౌరుణ్ణి అయిన నేను రాహుల్ గాంధీకి బలి కాకూడదు.
ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలు హిందువులు. ఆ పెద్ద శాతం హిందువుల కోసం, హిందువుల ప్రయోజనాల కోసం ఒక రాజకీయ క్రియా శీలకుడిగా రాహుల్ గాంధీ ఏ పనైనా చేశాడా? నేను హిందువులకు విధేయుడిని, నాకు హిందువులు ముఖ్యం, నేను హిందువుల మనిషిని, నేను హిందువుల కోసం పనిచేస్తాను అని రాహుల్ గాంధీ తన బతుకులో ఒక్కసారైనా చెప్పాడా? చెప్పినట్టు లేదు. ఒక మామూలు హిందువునైన నాకు అందుకే రాహుల్ గాంధీ అంటే భయం వేస్తోంది.
నా తోటి దేశ హిందూ పౌరులారా! నాకే కాదు, మీకు కూడా రాహుల్ గాంధీ అపాయకరమే; రాహుల్ గాంధీ తాను దేశానికీ హానికరమే అని ఏ రోజుకు ఆ రోజు తన ప్రవర్తనతో,మాటలతో రూఢీ చేసుకుంటునే ఉన్నాడు. మాననీయ కేంద్ర ప్రజా ప్రభుత్వామా! మాననీయ హోం మినిష్టర్! మాన్య ప్రధాన మంత్రి గారూ! నాకు, దేశంలోని ప్రతి హిందువుకు,
ఈ దేశానికి రాహుల్ గాంధీ వల్ల ప్రాణ హాని ఉంది; నాకు, ఈ దేశ హిందువులకు, ఈ దేశానికి రాహుల్ గాంధీ నుంచి రక్షణ కావాలి.
- రోచిష్మాన్
9444012279
