October 13, 2026

సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి

  • మంత్రులు రెండవ పంట వేసుకోవద్దని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్

హైదరాబాద్: కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆది శ్రీనివాస్ ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు.కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు ఊర్ల మీద పడి ఊరేగుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా హైదరాబాద్ కు పెట్టుబడులు వచ్చాయి. కుట్రపూరితంగా కేటీఆర్ ను బద్నాం చేయాలని ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు పెట్టారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లు తవ్వి 300 కోట్లు దుర్వినియోగం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి. కేటీఆర్ ను కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. ఛార్జ్ షీట్ లో ఏం తేల్చారో చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్ట పీసు కేసు. డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు తేలుస్తుంది. కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు భయం?

కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడరు. చాలా కేసుల్లో రాహుల్ గాంధీ స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. కేటీఆర్ అనేక సార్లు కోర్టులకు హాజరయ్యారు. ఎల్ నినో పేరు మీద ప్రజల ఉసురు ప్రభుత్వం పోకుంటుంది. మేడిగడ్డ నీళ్లను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను ఎందుకు నింపలేదు? కరోనా కాలంలో సైతం రాష్ట్రాన్ని కేసీఆర్ సమర్థవంతంగా నడిపారు. రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది.

సింగరేణిలో నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులు రెండవ పంట వేసుకోవద్దని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పరిపాలన చేతగావడం లేదని ముక్కు నేలకు రాయాలి.

Total Visitors: 2,951,128