– టీటీడీ
తిరుమలలో కోవిడ్ నిబంధనల ను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒక చోట గుమికూడేలా చేసిన శ్రీ రాధమనోహర్ దాస్ అనే వ్యక్తి చర్యలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం, వారిని అన్య మతస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాము.
శ్రీ దాస్ అధికారులను కించపరిచేలా, మతాల.మధ్య చిచ్చు పెట్టి భక్తుల్లో అలజడి రేకెత్తించేలా వ్యవహరించారు. ఇంతటితో ఆగకుండా సదరు వీడియోను, అవాస్తవ సమాచారాన్ని సోషల్.మీడియాలో
పోస్ట్ చేశారు. గతంలో కూడా అనేక సార్లు ఈయన ఇలాగే వ్యవహరించారు. ఆయన తిరుమలకు తిరుమలకు వచ్చినప్పుడల్లా ఉద్యోగులను కించపరచడం , భక్తులను ఇబ్బంది పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పవిత్ర పుణ్య.క్షజేత్రమైన తిరుమలలో ఆమోదయోగ్యం కాని భాష వాడుతున్న ఇలాంటి వారికి భక్తులు అడ్డు చెప్పాలని, ఇలాంటి వ్యక్తుల అవాస్తవ ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.