Suryaa.co.in

Andhra Pradesh

రైతు కోసం..మీరు ఏం చేశారు బాబూ..?

– బాబు లాంటి దిగజారిన ప్రతిపక్ష నాయకుడ్ని దేశంలోనే చూడలేదు
– బాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఏడాదీ కరువే.. సీఎం జగన్ పాలనలో కరువు అన్నదే లేదు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎం వీ ఎస్‌ నాగిరెడ్డి
ఎం వీ ఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..రైతు కోసం.. అంటూ చంద్రబాబు పిలుపునివ్వడం ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద జోక్‌.
– 14 ఏళ్లపాటు ముఖ‍్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదు. 1995 నుంచి 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రాజెక్టులలో నీళ్లు లేక, పంటలు పండించుకోలేక, లక్షలాది మంది వలసలు వెళ్ళిన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు చూశాం. చేసిన అప్పులను తీర్చుకునేందుకు భూములు అమ్ముకుందామన్నా వాటి ధరలు కూడా పడిపోయాయి. చంద్రబాబు హయాంలో 18 సహకార బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, నష్టపరిహారం ఇవ్వాలని అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డి కోరితే.. “నష్ట పరిహారం ఇస్తే మరింత మంది రైతులు కావాలని ఆత్మహత్యలు చేసుకుంటారని” రైతుల గురించి అంత చులకనా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు.
రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వమంటే.. “ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలి” అని చంద్రబాబు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి అడిగితే.. “పావలా వడ్డీ కూడా రాదు, ప్రాజెక్టులు దండుగ” అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. గతంలో తన 9 ఏళ్ళ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. పైగా, దేవగౌడను తానే ప్రధానమంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడుగా మారిన కర్ణాటక సర్కార్‌ చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలోనూ మౌనంగా ఉండిపోయారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు.
పీడ కల లాంటి చంద్రబాబు పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఇప్పటికీ రైతులు గుండెల్లో చిరస్మరణీయుడుగా పెట్టుకున్నారు. వాగ్దానాలు ఇచ్చి రైతును దారుణంగా మోసం చేసిన చంద్రబాబును కూడా ప్రజలు మోసగాడుగానే గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబు 2012లో చేసిన పాదయాత్రలో, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో.. ” రైతుల కష్టాలు చూసి తన గుండె చలించింది.. రుణాలు అన్నీ బేషరతుగా రద్దు చేస్తాను, తాకట్టు పెట్టిన మహిళల పుస్తెల తాడులను మీ ఇంటికే తెచ్చిస్తాను, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాను, రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా” అని రైతులకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక, తన అయిదేళ్ల పాలనలో వీటిలో ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేకపోయారు..?
అటువంటి రైతు వ్యతిరేకి చంద్రబాబు.. ఇప్పుడు రైతు కోసం అంటూ పిలుపు ఇవ్వడం చూస్తే విచిత్రంగా ఉంది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక.. 2014లో రాష్ట్రంలో 238 మండలాలను కరువు మండలాలుగా ఆయనే స్వయంగా ప్రకటించారు. 2015 లో 359, 2016లో 301, 2017లో 121 , 2018 ఖరీప్ లో 347, రబీలో 227 కరువు మండలాలుగా బాబే డిక్లేర్‌ చేశారు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలో వచ్చాక.. 2019, 2020లో కరువు మండలాలే లేవు. అంటే దానర్థం ఏమిటి చంద్రబాబు గారూ.. ?
రాష్ట్రంలో ఒక్క కరువు మండలం కూడా లేదని, మీరు రైతు కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారా చంద్రబాబు గారూ? రైతులు సంక్షోభంలో ఉండి వారి భూములు, ఆస్తులు అమ్ముకుంటే… మీ వెనక తిరిగే వైట్‌ కాలర్‌ పీపుల్‌ తో ఆ భూములను కొనిపిద్దామని పిలుపునిస్తున్నారా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
టీడీపీ గత అయిదేళ్ల పాలనలో (2014-2018) రాష్ట్రంలో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి సరాసరి తీసుకుంటే 153 లక్షల 95వేల టన్నులు అయితే.. 2019-20లో 175లక్షల 12వేల టన్నులు ఉత్పత్తి అయింది. అంటే, చంద్రబాబు హయాంతో పోల్చి చూసుకుంటే 13.75 శాతం ఈ ప్రభుత్వం హయాంలో పెరిగింది. 2020-21లో కూడా 166 లక్షల 60 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. మొత్తంగా ఈ ప్రభుత్వంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చూసి ఓర్వలేక మీరు రైతు కోసం.. అంటూ నిరసనలు చేస్తున్నారా?
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తాను అని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అసలు పట్టించుకోనేలేదు. చంద్రబాబు హయాంలో ఉచిత విద్యుత్ కు సంబంధించిన బకాయిలు రూ. 8వేల 750 కోట్లు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే చెల్లించారు. డిస్కంలకు మీరు పెట్టిన బకాయిలు చెల్లించి, పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ రైతులకు ఇస్తున్నందుకు బాధతో మీరు రైతు కోసం రోడ్డెక్కుతున్నారా?
రైతు రుణాలు రూ. 87వేల 612 కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. మీ అయిదేళ్ల కాలంలో కనీసం రూ.14వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు. చివరికి, నాలుగు, అయిదు ఇన్‌స్టాల్‌మెంట్లు కూడా బాకీలు పెట్టి, రైతుల చేతుల్లో రుణ విమోచన అర్హత పత్రం అని ఖాళీ కాగితాన్ని చేతిలో పెట్టి దిగిపోయారు. ఇదేనా మీరు రైతులకు చేసిన న్యాయం..?
అదే జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్ల కాలంలోనే 17,030 కోట్ల రూపాయిలు రైతు భరోసా కింద చెల్లించి రైతులను ఆదుకుంటే మీకు ఎందుకు కడుపు మంట..? జాతీయ గణాంకాల ప్రకారం వృద్ధి రేటు తీసుకున్నా, సోషియో ఎకనమిక్ సర్వేలు చూసినా.. మీ పాలనలోనే రైతులు అప్పుల పాలైనట్లు, దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని చెబుతున్నాయి. మీ చేతగానితనం వల్ల రైతులు నష్టపోయినందుకే మీరు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారా?
టీడీపీ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రూ.40వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా కేవలం రూ.100 కోట్లతో ట్రెజరీ అప్పచెప్పినప్పటికీ… కోవిడ్‌ సంక్షోభంలో కూడా ప్రకటించిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్. ఏపీలో ప్రజలు ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకుండా మంచి పరిపాలన అందిస్తున్నందుకు మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారా?.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పర క్యాపిటా ఇన్‌కమ్‌ లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెద్దగా తేడా లేదు. సోషియా ఎకనమిక్ సర్వే ప్రకారం.. అదే జగన్‌ ముఖ్యమంత్రి కాగానే దేశంలో పర క్యాపిటా ఇన్‌కమ్‌.. 2019-20లో రూ. 8303లు(రూ. 1, 34,186) పెరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో 16,194 రూపాయలు(రూ. 1,68,480) పెరిగింది. ఈ ఏడాది 2020-21లో దేశంలో పర క్యాపిటా ఇన్‌కమ్‌.. రూ. 6,418 లు(రూ.1,27768) తగ్గితే.. అదే రాష్ట్రంలో రూ. 1735 లు(రూ. 1,70,215) పెరిగింది. వీటన్నింటికి కారణం వ్యవసాయానికి, గ్రామీణ ప్రాంతాలకు, పేద వర్గాలకు డైరెక్ట్‌గా వారి ఖాతాల్లో నగదు జమ చేయడంతో వారి స్థితిగతులు మారాయి. ఆక్వా రంగానికి రూపాయిన్నరకే విద్యుత్‌ అందించడం ద్వారా రొయ్యల ఎగుమతులు పెరిగాయి. జలకళ పథకం పేరుతో రైతులకు ఉచితంగా బోర్లు వేయడం జరుగుతోంది.
చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నప్పుడు, మీరు అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు చేసిన బకాయిలను సైతం రైతులకు, ఇతరవర్గాలకు చెల్లిస్తూ, వాటిని సరిచేసుకోవడానికే రాష్ట్రం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వాస్తవాలను వదిలిపెట్టి ఆరోపణలు చేయడమా? గత రెండేళ్లలో రూ. 33వేల కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల ప్రొక్యూర్‌మెంట్‌ జరిగింది. చంద్రబాబా పాలనలో పది లక్షల హెక్టార్ల పంట ఎండిపోయిన పరిస్థితి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏం మంచి జరిగిందో చెప్పగలరా?. విత్తనం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం వరకు ప్రతిదీ రైతుకు అండగా ఉంటుంటే.. మీరు ఇవాళ రోడ్డెక్కుతున్నారా బాబుగారూ?. దేనికోసం మీరు రైతు కోసం అంటూ ఆందోళనలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, రైతుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ఏడుస్తున్నారా…?. చంద్రబాబు చేసిన రైతు వ్యతిరేక పాలనకు, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు పక్షపాతి పాలనకు ఎక్కడైనా పొంతన ఉందా? నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మెలిగి, క్షేత్రస్థాయిలో నిజంగా సమస్య ఉంటే, సూచనలు, సలహాలు ఇస్తే, వాటిని పరిష్కరించడానికి అగ్రికల్చర్ మిషన్ గా, మేము ఎవరినైనా ఆహ్వానిస్తున్నాం. అది టీడీపీ వాళ్లు అయినా సరే. రైతులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగారి దృష్టికి వెళ్లగానే వెంటనే పరిష్కారం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగారు ఎంత మంచి చేస్తున్నా మీ కళ్ళకు మాత్రం కనిపించదు. ఎప్పుడూ ఏదో ఒక బురద చల్లడానికే ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో పూర్తి పారదర్శక పరిపాలన జరుగుతుంటే ఏదో విధంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం సరికాదు. 14ఏళ్లలో చంద్రబాబు రైతులకు ఏం చేశారో, వారిని ఎంత హేళనగా చూశారో అందరికీ తెలుసు. చంద్రబాబు ఇదే మైండ్ సెట్ తోనే ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ మారాలని ఎప్పుడూ చెప్పే చంద్రబాబు తన మైండ్ సెట్ ను మాత్రం మార్చుకోలేడు. అనుభవంలో పెద్దవారు అయిన చంద్రబాబు ఇప్పటికైనా, వాస్తవాలపై ఆత్మవిమర్శ చేసుకుని, నిర్మాణత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నాం.

LEAVE A RESPONSE