Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే జోగి రమేషపై టీడీపీ నేతలు ఫిర్యాదు

చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ప తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, టీడీపీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల తదితరులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా లీగల్ సెల్ అధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ.. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడుపై చేసిన దాడిని ఖండించారు.జెడ్ ప్లస్ కేటరిగి సెక్యూరిటీ, తెలుగుదేశం పార్టీ నాయకులపై రాళ్లతో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో చేసినట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడిని హత్య చేయాలన్న ఆలోచనతో దాడి చేశారని, ఎమ్మెల్యే జోగి రమేష్, అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులు సురేంద్ర ప్రసాద్, నర్సింగ్ శ్రీనివాస్, విఆర్ఎన్ నరేంద్ర మాజీ కార్పొరేటర్ సింహా నాగమణి, మీసాల నాగమణి, వీరా రాము, నేమాలి శ్రీను, దుత్తరపు గంగాధర్, చాపల చిన్ని రాజు, కానేటి ప్రభు, కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE