Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి: డీజీపీ సవాంగ్

కాలానికి ఎదురీది, అన్ని కాలాల్లో రోడ్లపై ఉంటూ శాంతిభద్రతల్లో తలమునకలయిన పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బంది సంక్షేమ దినోత్సవం నిర్వహించిన సందర్భంగా ఆయన పోలీసులనుద్దేశించి ప్రసంగించారు. సవాంగ్ ఏమన్నారంటే…
రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని సిబ్బంది ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాదారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన జరిగిన మహా యుద్దంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పోలీస్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజ సేవే పరామవిదిగా విధులు నిర్వహించి రాష్ట్ర ప్రజల మన్నలను పొందడమే కాకుండా విధినిర్వహణలో దేశం లోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.
కోవిడ్ మహమ్మారి జరిగిన పోరాటంలో విధులు నిర్వహిస్తున్న 200 మందికి పైగా సిబ్బంది ప్రజా సేవలో వీరమరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కు అందిస్తున్న ప్రోత్సాహం, సహాయ సహకారాలు తోపాటు ముఖ్యమంత్రి దిశానిర్దేశం తో అపత్కర సమయంలో ప్రత్యేక్షంగా ప్రజాలకు సేవ చేసే అవకాశం ఇతర ఏ శాఖలకు దక్కని విధంగా ఒక్క పోలీసు శాఖకు మాత్రమే దక్కిన అదృష్టంగా బావించాము.
ప్రజాసేవలో నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం పై గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ శాఖలో సంక్షేమ పరంగా క్షేత్ర స్థాయి సిబ్బందికి లబ్ధి పొందేవిధంగా నూతన సంక్షేమ పాలసీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఏపీ పోలీసు , భద్రతా పథకంలో బాగంగా అందుబాటులోకి తీసుకొని వచ్చిన నూతన సంక్షేమ పాలసీ వివరాలు:
ఈ సందర్భంగా పోలిశాఖలోని అన్ని విభాగాలు జిల్లా కేంద్రాల్లో ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేకంగా పోలీస్ వెల్ఫేర్ డే గా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నూతన పాలసీ లో భాగంగా ఋణాల లబ్ధి , ఋణాల వడ్డీ శాతం తగ్గింపు, ఋణాలు తిరిగి చెల్లించే కాలపరిమితిని పెంచడంతోపాటు వ్యక్తిగత, వాహనాలు, వివాహం, విద్య, గృహనిర్మాణం, గృహ స్థలాలు, విదేశీ చదువులుపై పొందే ఋణాల పరిమితిని భారీగా పెంచడం, వివిధ బ్యాంక్ లతతో చర్చించిన అనంతరం ప్రస్తుతం ఉన్న వడ్డీ శాతం వివిధ విభాగాల్లో సుమారు 2.5% నుండి 4% శాతాన్ని తగ్గిస్తూ నూతన పాలసీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గౌ తం సవాంగ్ మాట్లాడుతూ సిబ్బంది మరియు వారి కుటుంబం సభ్యుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా అమలులోకి తీసుకు వచ్చిన ఈ నూతన సంక్షేమ పాలసీ ఫలాలను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి సిబ్బందికి చేరే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించడం జరిగింది.
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేత
ఇటీవల విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 6th బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ శివ నాగరాజు కుటుంబానికి (50,00,000)యాభై లక్షల రూపాయల చెక్కు, విశాఖపట్నం కు చెందిన కానిస్టేబుల్ సూర్యనారాయణ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సి డెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా లభించిన 20 లక్షల చెక్కును అందజేయడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డిజిపి కృషి హర్షదాయకం: రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం
రాష్ట్ర పోలీసుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా భద్రత పధకం క్రింద ఇల్లు కొనుగోలు / నిర్మించు కొనేందుకు కేవలం 5 శాతం వడ్డీకి 40 లక్షల రూపాయలు , ఇంటి స్థలం కొనుగోలుకు 25 లక్షల రూపాయలు ఋణ సదుపాయం కల్పించడం ద్వారా పోలీసు సిబ్బంది వారి కుటుంబాలలో ఆనందాలు వెల్ల విరుస్తున్నాయి . పోలీసు పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎడ్యుకేషన్ లోన్ ను 50 లక్షలకు పెంచడం , భద్రతా పథకంలో కొత్తగా వాహనాలు ( టూ వీలర్ , ఫోర్ వీలర్ ) కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు పోలీస్ సిబ్బంది యోగక్షేమాలు సాధక బాధలు వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి శుక్రవారం పోలీసు సంక్షేమ దివస్ గా ప్రకటించడం ఎంతో ఆనందాయకం. రాష్ట్ర పోలీసుల సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

LEAVE A RESPONSE