దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.దీంతో బధ్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు.దీంతో ఎంపీ ఖుల్లెన్ గ్రామ పెద్ద, మరో నలుగులు మరణించారు. మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు.మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కాగా, గత ఆదివారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తుండగా మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని స్థానికులు వెల్లడించారు.