గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీని అణిచివేయాలని రెండేళ్ళుగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్ధిక మూలాలు దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది. వైసీపీ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. ఇవి ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసిన దాడులు. అందుకే నిన్న బంద్, నేడు చంద్రబాబు దీక్ష. మాపై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది. గవర్నర్‌ను కలిసి రెండు డిమాండ్లు పెట్టాం. రాష్ట్రపతి పాలన పెట్టాలి. సీబీఐ ద్వారా ఘటనపై విచారణ జరపాలి.’’ అని గవర్నర్‌ను కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.