-డిప్యూటీ సీఎం అంజాద్ బాష కామెంట్స్
బద్వేలు విజయం చరిత్రాత్మకం వైఎస్సార్ కాంగ్రెస్ కు అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిని ఆశీర్వధించిన బద్వేలు ప్రజలకు ధన్యవాదాలు. సంక్షేమం, అభివృద్ధి కి ప్రజలు పట్టం కట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కి ఓట్లు వేశారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు, బురద చల్లే ప్రయత్నాలు. ఈ విజయం ప్రతిపక్ష పార్టీల చెంప చళ్ళు మనేలా తీర్పు. బీజేపీ కి వచ్చిన ఓట్లు నేరుగా వచ్చినవి కాదు.
బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వచ్చిన ఓట్లు. టీడీపీ అభ్యర్థి ని ప్రకటించినా తిరుపతి ఎన్నికల్లో పునరావృతం అవుతుందని ఆఖరి నిమిషం లో పోటీ నుండి తప్పుకున్నారు. జనసేన పోటీ చేయమని అంటూనే బీజేపీ కి మద్దతు ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇద్దరు చంద్రబాబు మనుషులు కారా? వీరు బీజేపీ లోకి ఎందుకు వెళ్లారో తెలియదా? బీజేపీ తరపున టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఏజెంట్ లుగా కూర్చున్న పరిస్థితి.
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. 90 వేల పై చిలుకు భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షణీయం.ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అనవసర ఆరోపణలు మానేసి ప్రజా సమస్యల పై పోరాటం చేయాలి. ఉప ఎన్నిక తీర్పు ప్రతిపక్ష పార్టీలలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.