Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పేదలకు స్థానం లేదా..?

– అన్నీ అమరావతిలోనే పెట్టాలని బాబు పాదయాత్ర చేయిస్తాడా..!?
– అమరావతిలోని తన బినామీ భూములకు ధరలు పడిపోతున్నాయన్నదే బాబు బాధ
– బాబు ప్రజా రాజధానిని కోరుకోలేదు.. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లేని అమరావతి కావాలనుకున్నాడు
– బాబుకు కావాల్సింది స్టేట్ కాదు… రియల్ ఎస్టేట్ మాత్రమే
– రాష్ట్రానికి గెస్టుగా వచ్చి వెళ్ళే బాబును రాష్ట్ర ప్రజలు గెస్టు గానే చూస్తున్నారు
– అధికారం లేకపోతే.. చంద్రబాబుకు ఈ రాష్ట్రం కేవలం ఒక విడిది లాంటిది మాత్రమే
– పాదయాత్ర వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో గొడవలు జరిగితే.. వాటికి బాబు బాధ్యత వహిస్తాడా..?
– రాయలసీమకు వెళ్ళి మీకు రాజధాని ఇవ్వటానికి వీల్లేదు అని బాబు పాదయాత్ర చేస్తాడా..?
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ప్రెస్ మీట్
నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబుకు కావాల్సింది స్టేట్ కాదు… రియల్ ఎస్టేట్ మాత్రమే అని గతంలోనే చెప్పాం. ఇప్పుడూ చెబుతున్నాం. అమరావతిలో తన బినామీ భూములకు ధరలు పడిపోయాయని బాబు గారి బాధ అంతా ఇంతా కాదు. చంద్రబాబు ప్రజా రాజధానిని కోరుకున్న వ్యక్తే అయితే.. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవర్గాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామంటే.. కోర్టులకు తన మనుషుల్ని పంపించి చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారు.? పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే.. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పింది వాస్తవమా కాదా…? ఇంతకన్నా ఘోరం ఉంటుందా..?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలవారు ఉంటే తాను కలలుగన్న అమరావతి మురికికూపంగా మారిపోతుందని చంద్రబాబు మాట్లాడాడు.. తమను వద్దు అనుకున్న చంద్రబాబు కూడా రాష్ట్రానికి అవసరం లేదని ఈ వర్గాలంతా ఏకమై ప్రతి ఎన్నికలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు. జగనన్న నాయకత్వానికి జై కొడుతున్నారు.
అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. దానితోపాటే మిగతా నగరాల మాదిరిగానే సహజంగా అమరావతి అభివృద్ధి అవుతుంది. అయితే, ఇదే సమయంలో విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని వస్తుందంటే… మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందంటే.. దానిని బాబు ఎందుకు అడ్డుకున్నాడో ఆయనే చెప్పాలి.
– అలాగే, కర్నూలుకు హైకోర్టు వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకున్నాడో కూడా ఆయనే చెప్పాలి. అమరావతిలో శాసన రాజధాని ఉండటానికి వీల్లేదని ఎవరూ అనటం లేదు. కానీ, రాయలసీమలో అభివృద్ధి ఉండకూడదని, ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఉండకూడదని, అంతా తనకే, తన బినామీ భూముల రేట్ల కోసం కావాలని బాబు అడుగుతున్నాడు. దానికోసమే తిరుపతి యాత్ర మొదలు పెట్టించాడు. ఇది మిగతా ప్రాంతాల ప్రజల్ని అవమానించడం, రెచ్చగొట్టడం కాదా..?
అమరావతిలో చంద్రబాబు తన బినామీలను కొంతమందిని పెట్టుకుని, వారితో కెమెరాల ఉద్యమం చేయిస్తూ, దానికి 300 రోజులు, 600 రోజులు అని డప్పాలు కొట్టుకుంటూ .. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ తన బినామీల చేత యాత్రలు చేయిస్తున్నాడు. “మేము మాత్రమే బాగుండాలి.. మిగిలిన ప్రాంతాలవారు ఏమైపోయినా ఫర్వాలేదు” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్టు, ఆయన అనుకున్న పాంత్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలని, ఇక్కడ తన దాయాదులను కొంతమందిని పెట్టుకుని యాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాడు.
వీళ్ళు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వెళ్ళి చంద్రబాబు భాష వాడితే.. ఎక్కడైనా గొడవలు జరిగితే, దానికి చంద్రబాబు బాధ్యత వహిస్తాడా..?, వాటికి బాధ్యుడు చంద్రబాబు కాదా..?
రాయలసీమకు వెళ్ళి మీకు రాజధాని ఇవ్వటానికి వీల్లేదు అని బాబు పాదయాత్ర చేస్తాడా..? లేక అన్నీ అమరావతిలోనే పెట్టాలి, నా కడుపే నిండాలి, అక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సెంటు భూమి కూడా ఇవ్వటానికి వీల్లేదని చంద్రబాబు పాదయాత్ర చేయిస్తాడా..? ఇది ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా..? మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయండి అని పాదయాత్ర చేయించడం ఏమిటి? ఉద్రిక్తతలు పెరిగితే దానికి ఎవరిది బాధ్యత?
అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్న ఆయన బినామీలు, ఇంకా చంద్రబాబే సీఎం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారికి సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారిని కలవవచ్చు కదా.. కలవటం లేదంటేనే ఆ ఉద్యమం ఎవరు చేయిస్తున్నారో, ఎందుకోసం చేయిస్తున్నారో అర్థమవుతోంది.
బద్వేలు ఉప ఎన్నికలో ఓడింది ఒక్క బీజేపీ మాత్రమే కాదు, టీడీపీ, జనసేన కూడా. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిసి బద్వేలులో ఎలా పనిచేశాయో రాష్ట్ర ప్రజలంతా చూశారు. బీజేపీకి 21 వేలు ఓట్లు వచ్చాయంటే.. ఆ పార్టీకి ఏం చూసి జనం ఓటు వేస్తారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా, లేక విభజన హామీలు నెరవేర్చారనా..? బీజేపీకి చంద్రబాబు మద్దతివ్వడం ద్వారా.. ఆయన ఎటువైపు ఉన్నారో, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నాడో వేరే చెప్పాల్సిన పనిలేదు.
డైవర్షన్ రాజకీయంలో భాగంగా.. గతంలో తాను వెళ్ళలేని చోటికి పవన్ కల్యాణ్ ను పంపించినట్టే… ఇప్పుడు బీజేపీని సమర్థించడం, ఎన్నికల బరిలో లేను అని ప్రకటించడం లాంటివి చంద్రబాబు చేస్తూ వచ్చాడు. తీరా చూస్తే… ఇప్పుడు టీడీపీనే అంతర్థానం అయింది. బద్వేలు ఎన్నికలకు దూరం అంటూనే.. చంద్రబాబు బీజేపీకి మద్దతు పలికాడు. ఆయన బుద్ధేంటి అనేది రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమైంది.
రాష్ట్ర ప్రజలందరికీ ఒక విషయం బాగా అర్థమైంది. అధికారం లేకపోతే చంద్రబాబుకు ఈ రాష్ట్రం కేవలం ఒక విడిది లాంటిది మాత్రమే. ఎందుకంటే, ఆయన సొంతిల్లు హైదరాబాద్, ఆయన కొడుకు ఇల్లు హైదరాబాద్, దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్, రామోజీ ఇల్లు హైదరాబాద్, రాధాకృష్ణ ఇల్లు హైదరాబాద్, బీఆర్ నాయుడు ఇల్లు హైదరాబాద్.. వారి పెంపుడు ఎంపీ ఈ రాష్ట్రంలో కాలే పెట్టనంటున్నాడు. అంటే ఎల్లో మీడియా మొత్తం, వారి అధిపతులు మొత్తం, వారి పార్టీలు మొత్తం ఉన్నది హైదరాబాద్. అంటే ఈ రాష్ట్రానికి వారు గెస్టులు మాత్రమే. గెస్టుల్ని గెస్టులుగానే ఉంచారు ప్రజలు కూడా. ప్రజలు కూడా వీళ్ళు రాష్ట్రానికి అవసరం లేదని భావించారు.
జగన్ ఉండేది తాడేపల్లి. ఇక్కడకు వచ్చింది ఎన్నికలకు ముందే. కాకపోయినా, ఆయన ఓటు ఉన్నది పులివెందులలోనే. బాబు ఓటు హైదరాబాద్ లో.. బాబు కొడుకు ఓటు హైదరాబాద్ లో.. భార్య ఓటు, కోడలు ఓటు హైదరాబాద్ లో. ఇదీ 2017-18 వరకు వారి పరిస్థితి. ఇప్పుడు వీరందరి ఓట్లు మంగళగిరిలో.
కాబట్టి, కుప్పంతో కూడా చంద్రబాబుకు సంబంధం లేదు. కుప్పంతో సంబంధం లేదు కాబట్టే, కుప్పం ప్రజలు కూడా ఓడగొడుతున్నారు కాబట్టే, మొన్న కుప్పం వెళ్ళి సొంత నియోజకవర్గంలో మామూలు మీటింగ్ కోసం జనాన్ని కిరాయికి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి దైన్య స్థితిలో టీడీపీ ఉంది. కాబట్టి, రాష్ట్రంలో లేని టీడీపీ, రాష్ట్రాన్ని ఎంతకు దిగజార్చడానికైనా, ఎంతటి మాట అనటానికైనా సిద్ధపడుతుంది. కుప్పం వెళ్ళి, తాను ఎమ్మెల్యే అన్న విషయాన్ని మరిచిపోయి, నన్ను ఇక్కడ ఉండమంటారా.. వెళ్ళిపొమ్మంటారా.. అని చంద్రబాబు మాట్లాడారు.
అంటే చంద్రబాబులో భయం, వెన్నులో వణుకు ఏస్థాయికి వచ్చాయో చూశాం. సొంత నియోజకవర్గంలో కూడా అంతో, ఇంతో ఇచ్చి మీటింగులకు జనాన్ని పోగేసుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. మొన్న కూడా చంద్రబాబు వైజాగ్ వస్తారా.. కుప్పం వస్తారా.. పులివెందుల వస్తారా.. అని గట్టిగట్టిగా మాట్లాడుతూ సవాళ్ళు విసురుతున్నాడు. ఆయన మాటలు, చేష్టలు చూస్తుంటే, ఆయన మైండ్ పూర్తిగా బ్లాంక్ అయినట్టు ఉంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. బద్వేలు ఫలితంతో ఇక టీడీపీ అంతర్థానమయినట్టే.
చంద్రబాబు రాష్ట్రంపై పగబట్టాడు. మరోవైపు తన రాజకీయ వారసుడు అవుతాడనుకున్న కొడుకు పప్పు అని తెలిసి మరింత కుమిలిపోతున్నాడు. మరోకాయన, హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడూ వచ్చే ఫిలిం యాక్టర్.. చంద్రబాబుకు ఏ ఆపద వచ్చినా.. తగుదునమ్మా అని వచ్చి నాలుగు డైలాగులు చెప్పి వెళుతున్నాడు. వీరి యాక్టింగులు, డ్రామాలు ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు.
2024 ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడు ఉన్న 23 స్థానాల్లో 3 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళ వలన రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు అనుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ రక్షకుడిగా పనిచేస్తున్నాడు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఏ ఎన్నిక వచ్చినా జనం నెత్తిన పెట్టుకుని గెలిపిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు రాజకీయాలు విరమించుకుని, హైదరాబాద్ లోనే శేష జీవితం గడిపితే మంచిది.

LEAVE A RESPONSE