Suryaa.co.in

Andhra Pradesh

ఎయిడెడ్ సంస్థ‌ల విద్యార్థుల‌కు అండ‌గా వుంటాం

-పోలీసుల దాడిలో గాయ‌ప‌డిన విద్యార్థుల్ని ఫోన్‌లో ప‌రామ‌ర్శించిన టిడిపి జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌
అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాలని కొన‌సాగించాల‌నే డిమాండ్ తో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసులు లాఠీచార్జి చేసి అత్యంత దారుణంగా హింసించారు. పోలీసుల దాడిలో గాయ‌ప‌డిన విద్యార్థినుల‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు.
తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి విద్యార్థుల‌ ప‌ట్ల పోలీసులు ఎంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించారో వివ‌రించ‌గా, విద్యార్థులకు అండగా ఉంటామ‌ని, ఆందోళన చెందవద్దని నారా లోకేశ్ భ‌రోసా ఇచ్చారు. విద్యార్థుల్ని ఉగ్ర‌వాదుల్లా నిర్బంధించి, అత్యంత హేయంగా దాడిచేశార‌ని, చాలామందిని పెడ‌రెక్క‌లు


విరిచిప‌ట్టుకుని, జీపుల్లో కుక్కి.. దాడులు చేసుకుంటూ తీసుకెళ్లార‌ని విద్యార్థిని రోదిస్తూ లోకేష్‌కి వివ‌రించ‌గా, పోలీసుల తీరుని లోకేష్ ఖండించారు.
గాయ‌ప‌డిన విద్యార్థులకు వైద్య‌సాయం అందేలా చూడాలని టీఎన్‍ఎస్‍ఎఫ్ నాయకులకు ఆదేశాలిచ్చిన లోకేష్‌…ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్ని య‌థావిధిగా కొన‌సాగించేలా పోరాడుతున్న‌ విద్యార్థుల డిమాండ్ నెర‌వేరే వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీ అండ‌గా నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

LEAVE A RESPONSE