– ఏ.పి.జి.ఇ. ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మీక, పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగా ఉండుటకు ఉద్యోగ సంఘ నాయకుల వైఫల్యమే కారణం అని ఒంగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో వినుకొండ రాజారావు వ్యాఖ్యానించారు.
ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఆవిర్భావ సభను రాష్ట్రం లోని 13 జిల్లాల నుండి తుఫాను ను సహితం లెక్క చేయకుండా ఉద్యోగులు తరలి వచ్చి విజయ వంతం చేదినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటలో సంఘాల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, సరైన పంథా లో ప్రభుత్వంతో చర్చలు సాగించలేక పోవడం, సాచి వేత ధోరని అవలంభించడం, ప్రశ్నించే తత్వాన్ని మరచి మైలేజ్ కొరకు ప్రాకులాడుతూ, ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం ప్రాకులాటలో ఉద్యోగుల హక్కులు, ఆశల పై నీళ్లు చల్లుతున్నారని, నాయకుల వైఫల్యమే సమస్యలు అపరిష్కృతంగా ఉండుటకు కారణం అని, సాధారణ ఉద్యోగుల ఆర్తనాదాల నుండి ఆవిర్భవించిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అని, తెలియచేశారు.
అలాగే ఆయన మాట్లాడుతూ అనేక సంఘాలలో పని చేసిన అనుభవం ఉన్న నాయకులతో ఏర్పాటయిన సంఘం లో భజన పరులను తయారు చేయకుండా, భవిష్యత్ నాయకులను తయారు చేయటమే సంఘం లక్ష్యం అని, విజయవాడలో కేంద్ర కార్యాలయం త్వరలోనే ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తామని, 13 జిల్లాలలో రాష్ట్ర నాయకత్వం పర్యటనలు చేసి సంఘాన్ని బలోపితంచేస్తామని ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం అనే నినాదంతో ఉద్యోగుల ను చైతన్యం చేయాలనే దృక్పథంతో సంఘం ముందుకొచ్చిందని, రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా నన్ను. రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నుకోవడం ఒక పక్కన ఆనందం అయితే మరో ప్రక్కన మరింతగా నాభాధ్యతను పెంచిందని వినుకొండ రాజారావు తెలియజేశారు.