– బాదితుడ్ని పరామర్శించిన జివి.ఆంజనేయులు
వినుకొండ:- ప్రజాదరణ కోల్పోయిన యంయల్ఏ బొల్లా బ్రహ్మనాయుడు ఓటమి భయంతో నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలను సృష్టిచిస్తున్నాడని మాజీ శాసనసభ్యులు జివి ఆరోపించారు. శావల్యాపురం జెడ్పీటిసి ఎన్నికల్లో వైసిపి కి ఓటు వేయలేదని పోట్లూరు గ్రామంలో లింగా జగన్నాధం పై, మతుకుమల్లి లో టిడిపి కార్యకర్త చింతా గంగయ్య పై దాడికి పాల్పడినారని,టిడిపి నాయకులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జివి డిమాండ్ చేశారు.
ఐనఓలు యస్ఐపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: జివి.ఆంజనేయులు
శావల్యాపురం మండల టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి పారా హైమవతి పోలింగ్ సరళిని పరిశీలించుకోవడానికి వేల్పూరు లో పోలింగ్ కేంద్రాల వద్ద కు వెళుతుండగా మహిళా కానిస్టేబుల్స్ సహయంతో హైమావతి ని వెళ్లకుండా ఐనఓలు యస్ఐ అనిల్ అడ్డుకున్నారని ఈ సంఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జివి.ఆంజనేయులు అన్నారు.