– టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం, పోలింగ్ ఏజెంట్లను హౌస్ అరెస్ట్ చేయడం
– వేరేప్రాంతాలనుంచి దొంగ ఓటర్లను తరలించి గెలిచినందుకు ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి.
– మార్చిలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుటి ఎన్నికలకు టీడీపీ పుంజుకుంది
– కేవలం 7నెలల్లోనే 13శాతం ఓట్లు పెంచుకున్న టీడీపీ, మరో 7నెలల్లో రాష్ట్రంలో వైసీపీనే లేకుండాచేస్తుంది.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు
తాజాగా వెల్లడవువుతున్న స్థానికఎన్నికల ఫలితాల్లో వాపుని చూసుకొని బలమని ప్రభుత్వం భావిస్తోందని, దొంగఓట్లశాఖా మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జగన్మోహన్ రెడ్డి అభినందించడం సిగ్గుచేటని, నిజంగా ఈ ముఖ్యమంత్రికి తాను అభివృద్ధి, సంక్షేమం అమలుచేస్తున్నాననే నమ్మకముంటే, టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికారులు, పోలీసులసాయంతో ఎందుకు అడ్డుకున్నారో, అకారణంగా ఎందుకు తిరస్కరించారో ఆయనే సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
టీడీపీ నేతలెవరూ కుప్పంలో ప్రచారం కూడా చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి, పోలీసుల సాయంతో వారిని ఎందుకు అరెస్ట్ చేయించాడు.. అర్థరాత్రిళ్లు వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి, జిల్లాలుకూడా దాటించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం యథేచ్ఛగా వార్డుల్లో తిరుగుతూ, ఓటర్లను, టీడీపీ అభ్యర్థుల ను ఎందుకు భయభ్రాంతులకుగురిచేశారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానంచెప్పాలి. దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా పోటీలో ఉన్నఅభ్యర్థులు ప్రచారం చేయడానికి అనుమతి కావాలంటూ ఈ ప్రభుత్వం వారిని అడ్డుకుందన్నారు.
నిజంగా ప్రజల్లో వైసీపీవారిపై అంతటి ప్రేమాభిమా నాలే ఉంటే, ఎందుకింత అడ్డగోలుగా వ్యవహరించారు? సమాధానం చెప్పాలంటూ ఎప్పుడు పడితే అప్పుడు టీడీపీవారికి నోటీసులివ్వడం, అభ్యర్థులు ప్రచారానికి వెళ్లకుండా రాత్రివేళ వారిని అపహరించడం ఎందుకుచేశారో దొంగఓట్లశాఖా మంత్రి సమాధానంచెప్పాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ లవద్దకు వెళ్లాల్సిన టీడీపీ ఏజెంట్లను తెల్లవారుజామున 5గంటలకు ఎందుకు హౌస్ అరెస్ట్ లు చేశారో దొంగఓట్ల మంత్రికే తెలియాలి.
ఈ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమపథకాలు, నవరత్నాలపై మంత్రులకు, అధికారపార్టీ నేతలకు అంతనమ్మకముంటే, కుప్పంలో ఓటుకి రూ.10వేలు ఇచ్చి, రూ.100కోట్లవరకు ఎందుకు ఖర్చుపెట్టారు. టీడీపీ వారికిభోజనాలు పెట్టారని, గ్యాస్ ఏజెన్సీలను రద్దుచేయడం, మెడికల్ షాపులపైకి డ్రగ్స్ అధికారులనుపంపడం, టీడీపీవారి గనులను మూసేయించడం వంటి దుర్మార్గాలు ఎందుకుచేశారో దొంగఓట్లశాఖామంత్రే చెప్పాలి. ఎన్నికల రోజున ఇతర నియోజకవర్గాలనుంచి డబ్బులిచ్చిమరీ దొంగఓటర్లను ఎందుకు తరలించారు? ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో వైసీపీకి ప్రజలు ఓట్లేయరనే, ప్రభుత్వం దొంగఓటర్లను తరలించింది.
ఒకరోజు ముందుగానే దొంగఓటర్లను పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని హోటళ్లు, కళ్యాణమం డపాలకు తరలించి, వారికి ఎందుకు పోలీసులతో రక్షణకల్పించారో దొంగఓట్ల మంత్రి పెద్దిరెడ్డి సమాధానంచెప్పాలి. ప్రతివార్డులో గుర్తుతెలియని అనధికార వ్యక్తులతో దొంగఓట్లు వేయించి న అధికారపార్టీ, అలాంటివారిని పట్టుకున్న టీడీపీవారిపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించింది. వాలంటీర్లు, డ్వాక్రామహిళలసాయంతో దొంగఓట్లు వేయించి, కుప్పంలో గెలిచా మని చెప్పుకోవడానికి దొంగఓట్లమంత్రి, ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.
7నెలల క్రితం మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 52శాతం ఓట్లువస్తే, టీడీపీకి కేవలం 30శాతం ఓట్లుమాత్రమే వచ్చాయి. 7నెలలతర్వాత ఇప్పుడు జరిగిన స్థానికఎన్నికల్లో అధికారపార్టీకి 48శాతం ఓట్లువస్తే, టీడీపీకి నేడు43శాతం ఓట్లువచ్చాయి. ఎవరి బలం ఎంతపెరిగిందో ఈ లెక్కలే చెబుతున్నాయి. కేవలం 7నెలల కాలంలో టీడీపీకి 13శాతం ఓట్లుపెరిగాయి. జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు చెబుతున్నట్లు ప్రభుత్వంపై ప్రజలకు ఆదరాభిమానాలు పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో పెరిగినఓట్లశాతమే చెబుతోంది.
ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే ప్రజల్లో మార్పుమొదలైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. కేవలం 7నెలలసమయంలోనే పుంజుకున్న టీడీపీ, మరో 7నెలలు గడిచేనాటికి అధికారపార్టీకి ఎక్కడా అవకాశం లేకుండా చేస్తుందని చెప్పడానికి ఏమాత్రంఆలోచించడం లేదు. రాబోయే రోజుల్లో వైసీపీని కనుమరుగుచేసేస్థాయిలో టీడీపీప్రజాదరణ పొందుతుందనే పచ్చినిజాన్ని ముఖ్యమంత్రి, దొంగఓట్లమంత్రి, బొత్ససత్యనారాయణ గ్రహిస్తే మంచిది.