– ఏ.జి&ఏస్ .జి కళాశాల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు
ఎయిడెడ్ కళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ ag&sg కాలేజీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాలఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న శాసనమండలి మాజీ సభ్యులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ అక్కడకు చేరుకుని పోలీసులు మరియు కాలేజీ ప్రిన్సిపల్ తో చర్చించి విధ్యారుల పై ఇచ్చిన కంప్లైంట్ ఉపసం హరింపజేసి, అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయించడం జరిగింది .
అనతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలలు మరియు కాలేజీల పై ప్రభుత్వం తీసుకొచ్చిన జి ఓ లను వెంటనే ఉపసంహరించు కావాలని ప్రభుత్వవిధానాల వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారనీ ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు,
విద్యార్థులతో రాజేద్రప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం శాంతి యుతంగా నిర్వహించాలని తను కూడా విద్యార్థి ఉద్యమాలతోనే ఈ స్థాయికి వచ్చానని ఆవేశాలకు పోయి కాలేజీ ఆస్తులకు నష్టం కలిగించే వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అజ్మతుల్లా,బూరెల నరేష్, జంపాన తేజా సిగతాపు ప్రసాద్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.