– సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో , లెక్కపరంగా తెరాస అభ్యర్థి తాత మధుపై,, రాయల నాగేశ్వరావు ఓడిపోయినా నైతిక విజయం కాంగ్రెస్‌దే నని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు….
ఖమ్మం జిల్లా కాంగ్రేస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ..వాస్తవంగా కాంగ్రెస్‌కు 96 ఓట్లు మాత్రమే ఉన్నాయని, ఈ ఎన్నికల్లో 242 ఓట్లు రావడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందన్నారు.
తెరాస పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తూ ప్రలోభాలకు తెరలేపుతూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందన్నారు.ఇలాంటి కార్యక్రమాలకు అధికార పార్టీ పాల్పడకుండా ఉన్నట్లయితే కాంగ్రెస్‌కు విజయం చేకూరెదని అన్నారు . ఈ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడం వల్లనే కొన్ని ఓట్లు తగ్గాయన్నారు.ఈ ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికలకు పునాదిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ స్పూర్తితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై చేసిన అనేక పోరాటాలకు మద్ధతు తెలిపిన సీపీఎం, సీపీఐ ఎన్నికల్లో కలిసి వచ్చినట్లయితే అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పేవారన్నారు. సీపీఐ టీఆర్‌ఎస్‌కు మద్ధతు పలకడం, సీపీఎం ఓటింగ్‌లో పాల్గొనకపోవడం బాధాకరమన్నారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. ఈ సందర్భంగా కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటామన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై అభిమానంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.