అమరావతి : ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన సంచలన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
‘ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు!. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు.ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా!. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా!. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.