– తెలుగు రాష్ట్రాల బిసి సంఘాల ధర్నాకు రేవంత్ రెడ్డి మద్దతు
జంతర్ మంతర్ లో తెలుగు రాష్ట్రాల బిసి సంఘాల ధర్నాకు మద్దతు తెలిపిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జంగ్ సైరన్ ధర్నా కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన రెండు రాష్ట్రాలకు సంబంధించిన బిసి కార్యకర్తలు. జనగణనలో బిసిలను కులాల వారిగా లెక్క తేల్చాలంటూ ధర్నా.
రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి :
ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాసా ఎంపీలు ఎందుకు బీసీల గురించి మాట్లాడటం లేదు. జంతర్ మంతర్లో బీసీలు ధర్నా చేస్తుంటే వారికి తొమ్మిది మంది తెరాసా ఎంపీలు ఏం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే బడుగు బలహీన వర్గాల ద్వారా కాదా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి.బీసీలలో కుల గణాలు లెక్కించడం వల్ల బిసి విద్యార్ధులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుంది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీల కుల లెక్కలు చేపట్టింది… కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల సాధ్యంకాలేదు.
దేశ ప్రధానమంత్రి బీసీ కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోంది. బలహీన వర్గాల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా? ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీసీ అయ్యాక బీసీల గురించి పట్టించుకోవడం లేదు… బీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదు? రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల జనాభా లెక్క పెడతాం. బీసీల అంశంపై పార్లమెంటులో పోరాడుదాం మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది.