Suryaa.co.in

Andhra Pradesh

రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ప్రభుత్వానికి లేదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

అమరావతి: రైతుల్ని అన్నివిధాలా అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు టీడీపీ నేత శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు రాజ్యం తెస్తానన్న జగన్ రెడ్డి రైతులేని రాష్ట్రంగా మార్చేశారని ఆయన విరుచుకుపడ్డారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించరని, అబద్దపు హామీలతో రైతులను ముంచారని ఆరోపించారు. కనీసం నచ్చిన పంట వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదంటే రైతాంగం ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటుందో అర్ధమవుతుందని లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE