– రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాల్సిందే
– ఆ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది
– ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు
– తగిన కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయిలో ఉద్యమించండి
– ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ‘వర్క్ షాప్’లో బండి సంజయ్ వ్యాఖ్యలు
– ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి సమీక్ష… కార్యాచరణపై లోతైన చర్చ
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. బీజేపీ అధికారంలోకి రావాలలంటే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 19 ఎస్సీ నియోజకవర్గాలుండగా… ఆయా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోందన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆయా స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు తేలిందన్నారు. అందులో భాగంగా ‘మిషన్-19’ పేరుతో 19కి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
ఈరోజు (28.12.2021) కత్రియా హోటల్ లో బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం ఈ వర్క్ షాప్ కొనసాగనుంది. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విజయ రామారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, ఉఫాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై లోతుగా చర్చించారు.బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా అవతరించింది. ముఖ్యంగా దళిత సీఎం మొదలు దళిత బంధు వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైంది. దళితులంతా బీజేపీవైపు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.2023 సహా ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు చాలా కీలకం.
రాష్ట్రంలో 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిషన్-19 పేరుతో ఆయా నియోజకవర్గాల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా పేరుతో కార్యాచరణ రూపొందించాం. అందులో భాగంగానే ఈ సమీక్ష నిర్వహిస్తున్నాం.
ఇటీవల సర్వే నిర్వహిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో 19కి 19 స్థానాల్లో బీజేపీ బలంగా ఉందని తేలింది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ‘మిషన్-19’ పేరుతో ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. అందుకు అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించబోతున్నం.
బీజేపీ మొదటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోంది. దళితుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది.బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ ఇన్నాళ్లు విష ప్రచారం చేసింది.
రాజ్యాంగాన్ని మారుస్తారని, దళిత చట్టాలను నీరుగార్చుతున్నారనరి దుష్ప్రచారం చేసింది.అయినా దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఏ మాత్రం నమ్మడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 46 ఎస్సీ నియోజకవర్గాలను గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ (5) కే పరిమితమైంది.
బీజేపీని ఎంత బద్నాం చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రచారం చేసినా… జనం నమ్మలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. రాజకీయ దురుద్దేశం లేకుండా పేదలకు న్యాయం జరగాలని, పేదలకు అభివ్రుద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.అందుకే గతంలో బీజేపీ 2 ఎంపీ స్థానాల నుండి 303 సీట్ల దాకా గెలవగాలం. 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగాం.
మోదీ ప్రభుత్వంపట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం.మోదీ స్పూర్తితో కష్టపడి పనిచేయాలి. కేంద్ర పథకాలను జనంలోకి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో సమస్యలను గుర్తించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి.