Suryaa.co.in

Andhra Pradesh

రేణిగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతి:: చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్ మామండూరు, కుక్కలదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రేణిగుంట నుండి కోడూరు వైపు వెళుతున్న MH 03 CS 1777 కారు ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లగా ఎదురుగా సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ AP 39 W 3418 ని ఢీ కొట్టింది.

ముందు లారీని ఢీకొన్న కారు తిరిగి స్పీడ్ గా వెనుకకు రాగ వెనుక ఉన్న లారీ ఢీ కొట్టడం జరిగింది. కారులో 5 మంది ప్రయాణిస్తున్నారు. స్పాట్ లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గరికి తీవ్రమైన గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడిన వారిని తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ హాస్పిటల్ కు రేణిగుంట అర్బన్ పోలీసులు తరలించారు రేణిగుంట సిఐ అంజు యాదవ్, మరియు ఎస్సై సునీల్ , రక్షక్, డెమో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

LEAVE A RESPONSE