-ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతారా?
-లోటు బడ్జెట్ లో సైతం ఉద్యోగులకు మేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే
– టీడీపీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు
తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారిస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఆ హామీలు ఎందుకు అమలు చేయటం లేదు? సీపీఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఎందుకు రద్దు చేయలేదు? పిఆర్ సి ఎందుకు అమలు చేయటం లేదు?
ఉద్యోగులను చర్చల కోసం అని పిలిచి ప్రతిసారి రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పంపుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్దిక పరిస్తితి బాగోలేదని కుంటి సాకులు చెబుతున్నారు. జగన్ రెడ్డి చేతకాని పాలన వల్లే రాష్ట్రం ఆర్దిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక లోటు వేధిస్తున్నా వెనకడుగు వెయ్యకుండా తెలంగాణా ఉద్యోగులతో సమానంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 43 శాతం పిట్ మెంట్ ఇచ్చింది. పిట్ మెంట్ 29 శాతం అడిగితె 43 శాతం పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే.10వ పీఆర్సీకి బకాయి పడ్డ దాదాపు రూ 4 వేల కోట్లను మూడు విడతల్లో చెల్లించారు.
హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చిన శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఉచిత వసతి, వారంలో 5 రోజుల పనిదినాలు,కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కోసం ఆరోగ్య కార్డులు,30 శాతం అద్దె భత్యం,ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంపు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంపు, సమైక్యాoధ్ర ఉద్యమంలో 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లింపు. 11 వ పిఆర్ సి నివేదిక ఆలస్యం మైనందుకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.
నాడు తీవ్రమైన ఆర్దిక లోటులో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు అన్ని విధాల మేలు చేస్తే జగన్ రెడ్డి మాత్రం తాను ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. జగన్ రెడ్డికి ఉద్యోగుల ఓట్లు కావాలి కానీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పట్టవా?