– బీజేపీ నేత లంకా దినకర్
రియల్టర్ అవతారమెత్తి రాజధాని భూములకు ఎసరు పెట్టారు. ప్లాట్ల అమ్మకంతో నవులూరు భూములకు నూకలు చెల్లాయి. ప్లాట్ల అమ్మకం కోసం బ్రోచర్‍లో సెక్రటేరియట్, హైకోర్టు దూరం తెలిపారు. హైకోర్టు ప్రస్తావించారంటే అమరావతి ఏకైక రాజధాని అని ఒప్పుకున్నట్లేనా ? మూడు రాజధానులని బొత్సతో మళ్లీ చెప్పించడం మోసం కాదా? సీఆర్‍డీఏలను మళ్లీ బతికించింది భూములు అమ్ముకోవడానికేనా? అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.
దినకర్ ఏమన్నారంటే..భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరకదు అంటూ కిల్ అమరావతి అంటున్న జగనన్న. రియల్టర్ అవతారం ఎత్తి రాజధాని భూములకు ఎసరు పెట్టిన జగన్ ప్రభుత్వం. రాజధాని 29 గ్రామాలలో ఉన్న నవులూరు భూములకు నూకలు చెల్లాయి, ప్లాట్ల అమ్మకం తో భూంఫట్. లేఔట్ డీటీసీపీ అప్రూవల్ నెంబర్ : LP03/2022/MIG/G, నవులూరు, మంగళగిరి, APCRDA అని బ్రోచర్ పైన తెలిపారు.
అమరావతి “స్మార్ట్ సిటీ” గా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, “స్మార్ట్ టౌన్ షిప్” కడతా.. రండీ.. కొనండీ అంటున్న జగనన్న. భూములు అమ్మడం కోసం లేఔట్ కి సెక్రటేరియట్ 10 కి.మీ, హై కోర్ట్ 15 కి.మీ దూరం మాత్రమే అంటూ బ్రోచర్ విడుదల. ప్లాట్లు అమ్ముకునేందుకు బ్రోచర్లో సెక్రటేరియట్, హై కోర్ట్ దూరం తెలిపారు అంటే అమరావతి ఏకైక రాజధాని అని ఒప్పుకున్నట్లే కాదా.
మరి మూడు రాజధానులు అని బొత్సాతో మరల చెప్పించడం అంటే, ప్లాట్లు కొనేవారిని మోసం చేయడం కాదా?బ్రోచర్లో సెక్రటేరియట్, హై కోర్ట్ దూరం తెలపడం అంటే విశాఖ, కర్నూల్ ప్రజలను కుడా మోసం చేయడం కాదా? జగనన్న మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి, ఇప్పుడు రాజధాని 29 గ్రామాల మధ్య మూడు ముక్కలాట మొదలు పెట్టాడు. CRDA ని మరల బ్రతికించింది, రాజధాని అమరావతి భూములును అమ్ముకోవడం లేదా అప్పు తెచ్చుకోవడానికా ?
కేవలం ప్రజల నుండి డబ్బు లాగడానికి, జగన్ తనని తాను మోసం చేసుకుంటూ హోల్సేల్ గా అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాడు.