– ఉద్యోగ సంఘాల నేతలు చాలా ఇమ్మేచ్యూరిటీ గా ఆలోచిస్తున్నారు
– సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఉద్యోగుల సమ్మె చేయడం విరుద్ధం
– ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులను బుజ్జగించిన జగనన్న సర్కారు, ఇకపై హెచ్చరికలపర్వాన్ని ప్రారంభించింది. ఆ మేరకు సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఉద్యోగులపై కొరడా ఝళిపించే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.
సజ్జల ఏమన్నారంటే.. మంత్రుల కమిటీ నుండి మూడు సార్లు చర్చలకు పిలిచాం.. స్టీరింగ్ కమిటీ సభ్యులు నుండి స్పందన లేదు. వస్తారనే ఎదురు చూసాం..మొన్నటి వరకు అధికారికంగా కమిటీ లేదన్నారు. అధికారికంగా జీవో ఇచ్చినా ..చర్చలకు రాకపోవడం ఏంటి? మీరు ఎక్కడో కూర్చుని డిమాండ్స్ చేస్తే ఎలా కుదురుతుంది. మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.
సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఉద్యోగుల సమ్మె చేయడం విరుద్ధం.జీతాలు ప్రాసెస్ చేయకుండా ఉంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.మెట్టు దిగకపోతే ఏ సమస్యా పరిష్కారం అవ్వదు.జేఏసీలో ఉన్న సంఘాలు కాకుండా వేరే ఏ సంఘాల ప్రతినిధులు వచ్చిన మాట్లాడతాం. ఉద్యోగ సంఘాల నేతలు చాలా ఇమ్మేచ్యూరిటీ గా ఆలోచిస్తున్నారు. ఉద్యోగులు.. మీరైనా మీ నాయకులకు చెప్పిండి. సమస్య జఠిలం అవ్వకుండా పరిష్కరించుకోవాలి. హెచ్ ఆర్ ఏ తగ్గిందో లేదో ఉద్యోగుల మా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీడియాలో ఎలా పడితే మాట్లాడితే ఎలా కుదురుతుంది? పీఆర్సీకి అంగీకారం తెలిపి ..ఇపుడు మళ్లీ సమ్మె అనడం ఏంటో ఉద్యోగ సంఘాలు ఆలోచించుకోవాలి.