కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ 2022-23 ప్రసంగాన్ని ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాదిపారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది కానుందని బడ్జెట్ పద్దును ప్రవేశ పెడుతూ నిర్మలమ్మ తొలి మాటలు ఇవి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ పరుగు ప్రారంభమైందన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లుగా చెప్పారు. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందని వెల్లడించారు.
త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ..
నిర్మలా సీతారామన్ ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేశామన్నారు. త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందన్నారు.