ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు : సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని, మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు.
కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని, ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.