Suryaa.co.in

Andhra Pradesh

అండర్ గ్రౌండ్‎కి ఉద్యోగ సంఘాల నేతలు

– హౌస్ అరెస్ట్‎లతో ఫోన్‎లు స్విచ్చాఫ్
– ఉద్యోగులు వర్సెస్ పోలీసులు

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు అండర్ గ్రౌండ్‎కి వెళ్లాయి. పోలీసులు హౌస్ అరెస్ట్‎లతో ఫోన్‎లు స్విచ్చాఫ్ చేశారు. ముందస్తు అరెస్టు‌లకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇళ్ల వద్ద నుంచి కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్‌కి వెళ్లిన నేతల ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. గురువారం చలో విజయవాడ నిర్వహించి తీరుతామని జేఏసీ నేతలు అంటున్నారు.
ఏపీలో పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ పోలీసులుగా మారింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కరోనా పేరుతో చలో విజయవాడకు అనుమతి నిరాకరించారు. అయితే ఉద్యోగులు మాత్రం ససేమీరా అంటున్నారు. ఎలాగైనా సరే చలో విజయవాడను నిర్వహించి తీరుమని పట్టుబట్టారు. అటు పోలీసులు కూడా వెనక్కి తగ్గడం లేదు. అనుమతి లేనందున విజయవాడకు రావొద్దని హెచ్చరించారు. ముందస్తుగా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రాంతంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. అటు పోలీసులు.. ఇటు ఉద్యోగుల పట్టుదలతో విజయవాడ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE