– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అబద్ధానికి ఫ్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్ రెడ్డి గారిలానే ఉంటుంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చెయ్యడం ఆయన నైజం. 2018లోనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు. రూ.7500 ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల జీతాన్ని రూ.4500 నుండి రూ.6000కు పెంచారు. టీడీపీ ఘనతని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు.