– జగన్ రెడ్డి అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం
– శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కిపెడుతోంది, వైసిపి నాయకులు అసత్యాలు వల్లెవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందో కింద పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే ప్రతి ఒక్కరికీ అర్ధమైపోతుంది.
16-02-2022నాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి (రూ కోట్లలో)
SUBJECT TDP 3 YEARS RULE
2016 TO 2018 YCP 3 YEARS RULE
2019 TO 2021 OVER AND ABOVE TDP 3 YEARS +/-
1.REVENUE RECEIPTS INCL. OPEN MARKET BUDGET BORROWINGS
1,65,507 2,52,369 +86,865
2.RR+OMB+DEVOLUTIONS +GRANTS-IN-AID
3,18,716 4,44,711 +1,25,995
3.OFF BUDGET CORPORATE BORROWINGS
3,32,569
4.OMB+OFF BUDGET BORROWINGS
4,83,791
5.GRAND TOTAL (2+3)
7,77,280
బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్రప్రభుత్వ ఆదాయం టిడిపి 3ఏళ్ల(2016-18)లో రూ 1,65,507కోట్లు ఉంటే, వైసిపి ప్రభుత్వ 3ఏళ్ల(2019-21)లో రూ 2,52,369 కోట్లు వచ్చింది. టిడిపి హయాం కంటే రూ 86,865కోట్లు అధికం.వీటికి కేంద్రం నుంచి వచ్చే నిధులు డివల్యూషన్స్ మరియు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం టిడిపి 3ఏళ్లలో రూ 3,18,716కోట్లు ఉంటే, వైసిపి 3ఏళ్లలో రూ 4,44,711కోట్లు వచ్చింది. అంటే రూ 1,25,995కోట్లు ఎక్కువ వచ్చింది.
పైన పేర్కొన్న వివరాలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగిందో ప్రతి ఒక్కరికీ అర్ధమై పోతుంది. ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంటే, పనితీరులో, వివిధశాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ 19 ప్రభావం ఏపిపై తక్కువే అనేది విశదం అవుతోంది.
గత 3ఏళ్లలో ఖర్చుచేసిన మొత్తం రూ 7,77,280కోట్లకు పారదర్శకతగాని, కనీస జవాబుదారీతనంగాని లేకపోవడం శోచనీయం.
రెవిన్యూలోటు 2018-19లో రూ 13,898కోట్లు ఉంటే, 2021-2022(రివైజ్డ్ ఎస్టిమేట్స్)లో రూ 66,280కోట్లకు పెరిగిపోయింది. అంటే రూ 52,291కోట్లు అధికం (376%).
ద్రవ్యలోటు 2018-19లో రూ 35,440కోట్లు ఉంటే, 2021-22(ఆర్ ఈ)లో రూ 78,826కోట్లకు పెరిగిపోయింది. అంటే రూ 43,386కోట్లు అధికం(122.4%).
ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ 2018-19లో రూ 34,757కోట్ల నుంచి, 2021-22లో రూ 51,500కోట్లకు పెరిగాయి. రూ 16,743కోట్లు అధికంగా తెచ్చారు(48.2%).
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ 2018-19లో రూ 54వేల కోట్లనుంచి, 2021-22లో రూ 1,18,565కోట్లు అధికంగా చేశారు. 219.6% ఎక్కువ.
ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మొత్తం కలిపి 2018-19లో రూ 88,757కోట్లు ఉంటే, 2021-22కు రూ 1,35,311కోట్లకు పెరిగాయి. 152.5% ఎక్కువ.
ఆదాయంలో మిగిలిన రాష్ట్రాలకన్నా ఏపి మెరుగ్గా ఉండగా, పురోగతి అధ్వానమైంది, అధోగతికి దిగజారింది. గ్యారంటీస్ బడ్జెట్ మాన్యువల్ పరిమితి మించిపోయాయి. 90%నుంచి 180%కు పెరిగాయి, రెట్టింపు అయ్యాయి.
ఎఫ్ ఆర్ బిఎం నిబంధనలు ఉల్లంఘించారు. 5% కన్సెషన్ కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలం చెందారు. వివిధ శాఖలకు అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ కేటాయింపులను గాలికి వదిలేశారు. అసెంబ్లీ గౌరవాన్ని మంటగలిపారు. సహజ వనరులను జె గ్యాంగ్ నిలువు దోపిడీ చేయడం రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీసే దుస్థితికి తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల దోపిడీ కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయి, ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమైంది.
కుదేలైన రాష్ట్ర ఆర్ధికరంగం-ఆకాశాన్నంటిన ఖర్చులు:
రెవిన్యూ వ్యయం రూ 1,28,569కోట్ల(2018-19) నుంచి రూ 1,96,022కోట్లకు (2021-22) పెంచేశారు. మూలధన వ్యయం రూ 19,976కోట్ల నుంచి(2018-19), రూ 13,422కోట్లకు(2021-22)తగ్గించేశారు. మొత్తం వ్యయం వైసిపి 3ఏళ్లలో రూ 1,63,959 కోట్లనుంచి, రూ 2,24,226కోట్లకు పెరిగాయి.
జిఎస్ డిపి(స్థిరధరల ప్రకారం) టిడిపి ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే, వైసిపి పాలనలో నెగటివ్ గ్రోత్(మైనస్ 2.58)కు దిగజార్చారు.
తలసరి ఆదాయం(స్థిరధరల ప్రకారం) టిడిపి హయాంలో రెండంకెల్లో ఉంటే, వైసిపి 3ఏళ్లలో సింగిల్ డిజిట్(1.03%)కు పతనం చేశారు.
ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయింది. సంక్షేమంపై ఏడాదికి రూ 40వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు చెప్పారు. 3ఏళ్లలో మొత్తం అప్పులు రూ 4,83,791కోట్లు తెస్తే, సంక్షేమంపై ఖర్చుచేసింది కేవలం రూ 1,20,000కోట్లు అడ్వయిజర్ చెప్పినట్లుగానే..మిగిలిన రూ 3,63,791కోట్లు ఏమయ్యాయి..? ఎవరి జేబుల్లోకి పోయాయి..? ఈ 3,63,791కోట్లకు లెక్కలను ప్రజలకు చెప్పే పారదర్శకత బూతద్దం వెతికి గాలించినా ప్రభుత్వంలో మచ్చుకు కూడా లేదు. అది నిజం కాకపోతే ఈ లెక్కలన్నీ బహిరంగంగా ప్రజలకు వెల్లడించండి. లేనిపక్షంలో ఈ భారీ మొత్తం(రూ 3,63,791కోట్లు) వెళ్లింది వైసిపి నాయకుల జేబుల్లోకేనని ప్రజలంతా భావిస్తారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం గినీ అసమానతలు 34వ స్థానం నుంచి 43కు ఎగబాకాయి. పాలకుల నిష్క్రియాపరత్వం పేదల జీవితాలకు శాపంగా మారింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది, పొదుపుశక్తి పూర్తిగా మందగించింది. గత 3ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి మచ్చుకైనా లేదు. దేశవిదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అప్రదిష్టపాలైంది, దీనితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని దుస్థితి. నిరుద్యోగం ప్రబలిపోయింది. సంక్షేమం చట్టుబండలైంది, అన్నివర్గాల ప్రజల్లో అశాంతి నెలకొంది.
కరోనా కన్నా జగోనా దుష్ఫలితాలే ఈ దుస్థితికి కారణం. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీయడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డే..తన అహంభావం, చేతగానితనం, మొండితనంతో చేతులారా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు, భావితరాల భవిష్యత్ ను సర్వనాశనం చేశారు.
నాశనానికి నిలువెత్తు రూపంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాడు. అసమర్ధుడి పాలన సృష్టించిన వినాశనం ప్రజల కళ్లెదుటే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ సర్వనాశన కారకుడికి తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్ ను కాపాడటమే ప్రజలందరి బాధ్యత.