– తప్పుడు కథనాలు వేసే ఏ మీడియా సంస్థనీ వదలం
– విచారణని తప్పించుకునే ఎత్తుగడలో సాక్షి మాజీ చైర్మన్ భారతి
– నేను ఏ1 కాదు..పవన్ కళ్యాణ్ ఏ2 కాదు
– సజ్జల రామకృష్ణారెడ్డి ఓ బ్రోకర్
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
ఇక తమపై కావాలని బురదచల్లే ఏ మీడియా సంస్థలనూ విడిచిపెట్టేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. తనపై అబద్ధపు కథనాలు రాసిన సాక్షి, డెక్కన్క్రానికల్పై పరువునష్టం దావా వేసిన లోకేష్.. కోర్టు విచారణ సందర్భంగా విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంగా టీడీపీని అప్రతిష్ఠపాలు చేసే మీడియా సంస్థలను ఇకపై విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. వారు ఇప్పుడు రాస్తున్న టీడీపీ వ్యతిరేక కథనాలు, అధికార పార్టీకి చేస్తున్న మేలును గమనిస్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియాను ఎప్పుడూ గౌరవిస్తామని స్పష్టం చేశారు.విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నారా లోకేష్ ఏమన్నారంటే…
“సాక్షి ఏడకి బోయావయ్యా! మొన్న రాలేదు..మమ్మల్ని మరిచిపోయావా?“
(సాక్షి మైక్ చూసి సాక్షి ప్రతినిధికి సైటెరిక్ పలకరింపు)
నాపైనా, మా నాయకుడు చంద్రబాబుపైనా తప్పుడు కథనాలు సాక్షిలో వేశారు. ఇవే కథనాల ఆధారంగా డెక్కన్ క్రానికల్, ది వీక్ లోనూ వేశారు. అదే రోజు అన్ని మీడియా సంస్థలకు అవి తప్పుడు కథనాలని నా వివరణ పంపాను.
ది వీక్ క్షమాపణలు చెప్పి, ఖండన కూడా వేశారు. తప్పుడు వార్తలపై ఎటువంటి స్పందనలేని సాక్షిపై 75 కోట్లు, డెక్కన్ క్రానికల్ 25 కోట్లకి పరువునష్టం దావా వేశాను. ఈ కేసు విచారణని తప్పించుకునే ఎత్తుగడలో సాక్షి మాజీ చైర్మన్ భారతి, ఇతర సిబ్బంది వున్నారు.
ఇంకెన్నాళ్లు తప్పుడు వార్తలు రాసి తప్పించుకుంటారో చూస్తాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చట్టాలలో ఉన్నా మాపై తప్పుడు రాతలు, నిరాధార కథనాలు సాక్షి వేస్తూనే ఉంది. మాపైనా తప్పుడు కథనాలు వేసే ఏ మీడియా సంస్థనీ వదలం. జగన్ రెడ్డిలా 42 వేల కోట్ల దోపిడీ చేయలేదు..ప్రజల కోసం పోరాడుతున్న మాపై అవాస్తక కట్టు కథలు వేస్తే క్షమించం. తప్పుడు కేసులపై
మా నేతలంతా పరువునష్టం దావాలు వేశాం. ఇకనైనా తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు వేయడం ఆపాలి.
జగన్ రెడ్డి ఓ ఫ్యాక్షన్ లీడర్. ఫ్యాక్షన్ మనస్తత్వం ప్రకారం ఇంకెవ్వరు వ్యాపారాలు చేయకూడదు, బాగా బతకకూడదు. నాపై ఒక్క కేసూలేకపోయినా కక్షతో 11 కేసులు వేశారు. ప్రజలపైనా, ప్రశ్నించే ప్రతిపక్షంపైనా, అధికారులపైనా అక్రమ కేసులు పెడుతున్నారు.
బీమ్లానాయక్ సినిమా విషయంలోనూ జగన్ అదే ఫ్యాక్షన్ బుద్ధితో ఇబ్బందులు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీపై కక్ష కట్టిన జగన్ మరీ ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ తెలుగు సినీపరిశ్రమకి పెడుతున్న ఇబ్బందులపై ఎప్పుడైనా మాట్లాడతాం. బీమ్లా నాయక్ సినిమా నచ్చిందంటే నచ్చిందంటాను. నేను చూడాలనుకున్న సినిమాలు నేను చూస్తాను. నేను ఏ సినిమాలు చూడాలో..ఎవరికి ట్వీట్ వేయాలో జగన్ బ్యాచీకి ఎందుకు? నేను ట్వీట్ వేస్తే వైసీపీ వాళ్లకెందుకు కంగారు? వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమాకి ఎందుకు వ్యతిరేకంగా వున్నారో జగన్‌రెడ్డిని నిలదీయాలి.
నేను ఏ1 కాదు..పవన్ కళ్యాణ్ ఏ2 కాదు. మేము సినిమా పరిశ్రమని ఇబ్బంది పెడుతున్నవాళ్లము కాదు. జగన్‌రెడ్డికి ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియని ఇతనో ముఖ్యమంత్రా? ఏమీ తెలియని జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ.
ఉన్న పరిశ్రమలే పోతే..ఇంకెవరు వస్తారు?
జగన్ పంపేసిన పరిశ్రమల లిస్టు చెబితే గంట పడుతుంది. హెచ్ఎస్ బీసీ విశాఖ నుంచి వైసీపీ వేధింపులతోనే తరలిపోయింది. విశాఖని పరిపాలన రాజధాని చేస్తానన్నారు..మూడేళ్లలో పరిశ్రమలన్నీ తరిమేశారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఒక రోడ్డయినా వేశారా, డ్రైనేజీ వేశారా? రరోడ్డుపై
గుంత పూడ్చలేని వాడు రాజధాని ఏం కడతాడు?
రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులని బెదిరిస్తే ఎవరు ఏపీకి వస్తారు?
కిడ్నాప్‌లు, బెదిరింపులతో ఎవరు కొత్తగా వస్తారు? తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ యజమానుల్ని వైసీపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేయడం పరాకాష్ట. దక్షిణ భారత్ బీహార్‌గా ఏపీని దిగజార్చేశారు.
మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతున్నారు కొత్త జీవో ప్రకారం మీడియా ప్రతినిదులు అవినీతిపై రాస్తే జైలే. లా అండ్ ఆర్డర్ లేదు…
ఫ్యాక్షన్ డాన్- కింగ్ అన్నీ జగన్‌రెడ్డే.
ప్రత్యేకహోదా కోసం యాక్షన్ చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడేం గాడిదలు కాస్తున్నారా? కేసుల కోసం ప్రధాని కాళ్లమీద పడి లేవడంలేదు జగన్‌రెడ్డి.
నాడు ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి, నేడు నవ్యాంధ్రని దోపిడీ చేసిన కేసులున్న జగన్‌రెడ్డి ఇంకేమి మాట్లాడతారు. జగన్ తన ఫ్యాక్షన్ బుద్ధిని సీబీఐకి చాటిచెప్పడానికి “వెల్కం టు ఆంధ్రప్రదేశ్ అని చెబుతూ సీబీఐపైనా కేసులు బనాయించారు“
పోలీసు వ్యవస్థని ఈ రేంజులో వాడి సీబీఐపైనే కేసు పెట్టడం దేశంలో తొలిసారి చూస్తున్నాం. సొంత చిన్నాన్న చనిపోతే ఆ
అబ్బాయ్ జగన్‌లో ఎంత ఆవేదన ఉండాలి..అదేమన్నా జగన్‌రెడ్డిలో కనపడుతోందా? వివేకా కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి హత్య గురించి చెబితే జగన్‌రెడ్డి ఆయన భార్య భారతి ఏమన్నారో చెప్పాక జగన్‌రెడ్డిపై అనుమానాలు బలపడుతున్నాయి. బాబాయ్‌ని చంపేసింది అబ్బాయేనని సాక్ష్యాలన్నీ బయటపడుతున్నాయి.
జగన్‌రెడ్డికి తరతరాల వారసత్వం అబద్ధాలాడటం. సొంత చిన్నాన్నని చంపి చంద్రబాబు చంపాడనేంతగా అబద్ధాలాడటం జగన్‌రెడ్డికి మాత్రమే సాధ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన బాబాయ్‌ని చంపించేశారని దొంగ ఏడుపులు ఏడ్చిన జగన్‌రెడ్డి, నాడు సీబీఐ విచారణ కోరి..అధికారంలోకి వచ్చాక ఎందుకు సీబీఐ వద్దన్నారు?
-సొంత చిన్నాన్న చనిపోతే ఎంత బాధ ఉండాల..ఎవరు చంపాలో తెలుసుకోవాలనిపించడంలేదంటే జగన్‌రెడ్డే దీనికి ఉన్నారని అనుమానం అందరికీ ఉంది.
సజ్జల రామకృష్ణారెడ్డి ఓ బ్రోకర్. బాబాయ్‌ని చంపింది అబ్బాయే.. అందరూ అదే చెబుతున్నారు…జగన్‌రెడ్డి కుటుంబసభ్యులే వెల్లడిస్తున్నారు.
స్టేట్మెంట్లో క్లియర్‌గా ఉంది. అవినాశ్‌రెడ్డే వివేకాని చంపేశారని, గుండెపోటు అనే ప్రచారం చేశారని. బాబాయ్ వివేకాని చంపేసిన అవినాశ్ రెడ్డి హాయిగా రోడ్లపై తిరుగుతున్నారు.ప్రజల కోసం పోరాడే మాపై దొంగ కేసులు పెడుతున్నారు. దీంతోనే తెలిసిపోతుంది ఈ మర్డర్ వెనక ఎవరున్నారో!
వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డిని డిజిపి సవాంగ్, సజ్జల, జగన్ కలిసి బెదిరించారు.సొంత చిన్నాన ఇచ్చిన సీటు, ప్రోత్సాహంతో ఎంపీ అయిన జగన్…రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌నే చంపేశారు.
ప్రయివేటు రంగంలో మేము పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకొచ్చామని ఇటీవల హఠాత్తుగా చనిపోయిన మంత్రి గౌతమ్‌రెడ్డి నాడు కౌన్సిల్లోనే వెల్లడించారు.
ఉన్న పరిశ్రమలకి తోడు, కొత్త పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు..రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు.
జగన్ వచ్చాక ఎన్ని పరిశ్రమలని తన్ని తరిమేశాడో చెప్పమంటారా? ఈ లిస్టు చెబితే గంట పడుతుంది.జగన్ కి ఇప్పుడు
ముఖ్యమంత్రి ఉద్యోగం ఉంది దోచుకుంటున్నాడు. ప్రజలకి ఉద్యోగాలు వద్దా? 5 వేలిచ్చే వలంటీర్లవి ఉద్యోగాలంటున్నాడు.రాష్ట్ర ఆదాయం తగ్గించి- అప్పులు పెంచిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి.
ఏ ముఖ్యమంత్రి అయినా ఆదాయం పెంచి సంక్షేమం చేస్తాడు. ఉన్న ఆదాయం తగ్గించి, సంక్షేమం పేరు చెప్పి అప్పులు చేస్తూ ఆస్తులు తాకట్టు పెడుతున్నాడు. జగన్‌రెడ్డి రాష్ట్రంలో అన్నీ తాకట్టు పెట్టారు. విశాఖలో కలెక్టరేట్, ఎమ్మార్వో ఆఫీసులన్నీ తాకట్టే పెట్టేశాడు.
ఇంకా కోర్టు, రోడ్లే మిగిలాయి. త్వరలో రోడ్డుకి టోల్ పెడతాడు. రోడ్లు తనఖా పెట్టుకున్న బ్యాంకులు రోడ్లు స్వాధీనం చేసుకుంటాయి. టిడిపి ఐదేళ్ల పాలనలో 2.50 లక్షలు అప్పులు చేసింది. జగన్ మూడేళ్లలో 4.50 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఐదేళ్లు పదవీకాలం పూర్తయ్యేసరికి 10 లక్షల కోట్లకి అప్పు చేర్చేస్తారు.
రానున్న రోజుల్లో ఏపీకి వచ్చే ఆదాయం వడ్డీలకి కూడా చాలదు.చెత్తపై పన్ను, బాత్రూమ్పై పన్ను వేశాడు. ఎన్ని తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలోనే వుంటాం.
వైసీపీ అరాచకాలు, దారుణాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే.. కేంద్రం జనాభా లెక్కల పూర్తి అయితే కానీ…ఏ హద్దులూ మార్చొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా మూర్ఖంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఆరంభించారు. కొత్తజిల్లాల పేరుతో సరిహద్దులు మార్చే హక్కు జగన్‌కి లేదు. దీనికి చట్టబద్ధతలేదు.