Suryaa.co.in

Andhra Pradesh

దళితులపై దాడుల గురించి గళం విప్పండి

– వైసీపీ ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి జవహర్ బహిరంగలేఖ

ఏపీ సీఎం జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు, వారిపై జరుగుతున్న దాడుల గురించి అసెంబ్లీ, కౌన్సిల్‌లో గళమెత్తాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి జవహర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన వారికి బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇది.

బహిరంగ లేఖ 08.03.2022
గౌరనవనీయులైన
వైసీపీ దళిత శాసనసభ, శాసన మండలి సభ్యులకు
నమస్కారం….
విషయం – జగన్ రెడ్డి పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసంపై చట్టసభల్లో నోరు విప్పాలి

ఎన్నికలకు ముందు దళితులకు కల్లబొల్లి మాటలు చెప్పి దళితుల ఓట్లు దండుకు‎న్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులను అడుగడుగునా అన్యాయానికి అవమానానికి గురి చేస్తున్నారు. జగన్ రెడ్డి దళితులను ఆర్దికంగా, రాజకీయంగా సామాజికంగా అణిచివేస్తున్నారు. టీడీపీ హయాంలో దళితులకు అమలు చేసిన సంక్షేమ పధకాలు నిలిపివేసి మరో వైపు తాత ముత్తాల నుంచి ఉన్న దళితుల పొలాలు సెంటు పట్టా పేరుతో లాక్కోవడమే కాక రాజ్యంగబద్దంగా రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించి దళితులకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరగని ప్రదేశం లేదు. వారి ఆర్తనాదాలు వినిపించని రోజు లేదు. విశాఖలో డా. సుధాకర్, చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్, చీరాలలో కిరణ్ వంటి ఎందరో దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళ నాగమ్మ వంటి ఎందరో దళిత మహిళలు, బాలికలు అత్యచారానికి గురయ్యారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ చేతాకానితనమే. వీటన్నింటిపై దళిత ప్రజా ప్రతినిధులు నోరు విప్పాలి. దళితులకు జగన్ రెడ్డి చేస్తున్నఅన్యాయంపై చట్టసభల సాక్షిగా ఆయన్ని నిలదీయాలని దళిత జాతి కోరుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన రాజ్యాంగ బద్ధమైన హక్కులు.ప్రస్తుతం బహుజనులు పోగొట్టుకున్న రాజ్యాంగబద్ధమైన 27 ముఖ్య అంశాలు:

1. ఎస్సీఎస్టీ ప్రమోషన్లో రిజర్వేషన్ అమలుకు నిరాకరణ
2. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 41 సిఆర్పిసీ నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంతవరకూ ఉత్తర్వులు జారీ చేయలేదు. ( అందువలన నిందితులు స్టేషన్ బెయిలు పొందుచున్నారు)
3.బహుజనులకు SC, ST,BC, మైనార్టీలకు 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కనీసం ఒక్క లోనూ కూడా మంజూరు చేయకపోవడం.
4.భూమి కొనుగోలు పథకం రద్దు (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము.)
5. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు.
6. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు.
7అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ రద్దు
8.ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకు లింక్ లోన్స్ రద్దు.
9.స్టడీ లీవు రద్దు. పూర్వ స్థితిని తొలగించుట.
10.ఏపీ స్టడీ సర్కిల్ రద్దు
11.బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు
12.వేల కోట్ల సబ్ ఫ్లాన్ నిధులు బదలాయింపు
13.ఎస్సీ,ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్ స్వాధీనం
14.ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై) ఎస్సీ జనాభా 50% ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం ‘ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ (పిఎంజి)రద్దు
15.నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ను రెండు సంవత్సరాల నుంచి ఒక్క లోను కూడా ఇవ్వబడలేదు.
16.నేషనల్ సఫాయ్ కరంచారి ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి):
17.స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాల రద్దు.
18.జీవో.ఎం.ఎస్.నెంబర్: 77 ద్వారా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోర్సులో చేరిన వారికి ఉపకారవేతనాలు ఉండవని 77 జీవో తెలియజేస్తుంది.
19.ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నిటినీ ప్రకటించకపోవడం
20.రిటైర్డ్ న్యాయమూర్తిని ఎస్సీ కమీషన్ కు నియమించక పోవడం
21.బహుజనుల పిల్లలకు విద్య దూరం చేయడానికే సర్కులర్ 172 జారీ చేయడం
22. 34 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో, పదకొండు వేల ఎసైన్డ్ ఎకరాలను స్వాధీనం చేసుకొనడం
23.మెడికల్ సీట్ల భర్తీలో బి కేటగిరీ, సి కేటగిరి సీట్లకు రిజర్వేషన్ వర్తింప చేయకపోవడం.
24.నూతన పారిశ్రామిక విధానం ద్వారా బహుజనులకు రుణాలు మంజూరు చేయకపోవడం.
25.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీము రద్దు

74 సంవత్సరాల స్వాతంత్రం భారతదేశంలో ఏకపక్షంగా ఇన్ని రాజ్యాంగ బద్ధమైన స్కీములను రద్దు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ రద్దులపై జగన్ సమాదానం చెప్పాలి.రాజ్యాంగ ఫలాలు పొందడం ఎస్సీఎస్టీబిసి మైనారిటీల హక్కు.పోగొట్టుకున్న హక్కులను తిరిగి పొందాలంటే నిరంతర పోరాటాలు అనంతమైన త్యాగాలే ఏకైక మార్గం అన్న డా.అంబేడ్కర్ స్పూర్తితో మీరు వ్యవహరించాలని కోరుకుంటూ….

కె.ఎస్. జవహర్
మాజీ మంత్రివర్యులు

LEAVE A RESPONSE