– తనపై మైనారిటీలకుఉన్న ఆగ్రహావేశాలను చల్లార్చడానికే ఉర్దూజపం మొదలెట్టాడు
– చంద్రబాబుఎప్పుడో రాష్ట్రంలో రెండోఅధికారభాషగా ఉర్దూని ప్రకటించారు
• అందలంఎక్కడానికి ముస్లింలను మెట్లుగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిం సమాజాన్ని నిలువునా ముంచేశాడు
• ఇప్పుడు ఏకంగా ఉర్దూభాషను ముస్లింలకుదూరం చేయడానికి కుట్రలు పన్నుతున్నాడు
• నిజంగా జగన్మోహన్ రెడ్డికి ముస్లింలపై , ఉర్దూభాషపై ప్రేమాభిమానాలుంటే చంద్రబాబు హయాంలో నిర్మించిన ఉర్దూ అకాడమీని ఎందుకు గాలికివదిలేశాడు?
• అక్కడి సిబ్బందికి జీతాలుకూడా ఇవ్వకుండా ఎందుకు వారిని రోడ్లపై పడేశాడు?
• చంద్రబాబు ముస్లింలకు అందించిన విదేశీవిద్య, దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్ –మకాన్, షాదీఖానాలు, మసీదులనిర్మాణాలకు నిధులవంటి వాటిని ఎందుకు తొలగించాడు?
– టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా
ఉర్దూభాషను రాష్ట్రంలో రెండో అధికారభాషగా పరిగణిస్తామని, విద్యార్థులు రెండోభాషగా అవసరమైతే ఉర్దూని తీసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం, తాను గతంలో ముస్లింమైనారిటీలకు ఇచ్చిన హామీలనుంచి పూర్తిగా వారిని దారిమళ్లించేక్రమంలో చేసి న ప్రకటనేనని టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా తేల్చిచెప్పారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
అధికారంలోకి రావడానికి, అందలంఎక్కడానికి ముస్లిం మైనారిటీలను మెట్లుగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక తానుచేసిన వాగ్థానాలన్నింటినీ విస్మరించి, రాష్ట్రంలోని ముస్లిం సమాజం మొత్తాన్ని దారుణంగా వంచించాడు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకోసం ప్రత్యేకంగా ఎన్నిపథకాలు అమలుచేశారో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోవచ్చాక ఎన్నిఅమలుచేశాడో ఆయన చెప్పగలడా? టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు , ముస్లిం యువతవిదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న సత్సంకల్పంతో విదేశీవిద్యపథకంకింద వారికి రూ.10లక్షలవరకు ఆర్థికసాయం అందించారు.
అలానే దుల్హన్ పథకం కింద ముస్లిం యువతులకు పెళ్లిచేసుకునే సమయంలో రూ.50వేలు అందించారు. 5ఏళ్లలో 80వేలమంది ముస్లింయువతులకు రూ.310కోట్లు చెల్లించారు. దుకాన్ మకాన్ పథకం కింద టీడీపీప్రభుత్వం స్వయంఉపాధికింద మైనారిటీ యువతకు ఏటా 10వేలమందికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు అందించింది.
రంజాన్ సమయంలో పేదముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న గొప్పఆశయంతో చంద్రబాబు రంజాన్ తోఫా కింద పండుగ సరుకులు అందించారు. షాదీఖానాల నిర్మాణానికి ఏటా రూ.5కోట్ల నిధులు ఇవ్వడంతోపాటు, మసీదుల మరమ్మతులకు కూడా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుగారు ఆర్థికసాయం చేశారు. అవన్నీ ఒకెత్తుఅయితే, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి ఐదేళ్లలో చంద్రబాబు రూ.3,500కోట్ల నిధులు కేటాయించారు.
అలాంటి అనేకపథకాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మాయమయ్యాయి. తాను అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రూపాయికూడా సాయంచేయని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయాడు. ఆఖరికి రంజాన్ తోఫా కానుకనుకూడా ఎత్తేసి, పేదముస్లింలకు పండుగసంతోషాన్ని దూరంచేశాడు.అలా అధికారంలోకివచ్చిన మూడేళ్లలో ముస్లింమైనారిటీల ముఖా న కనీసం పచ్చిమంచినీళ్లు కూడా పోయని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడుఉన్నట్లుండి ఉర్దూభాషపై ప్రేమపుట్టుకొచ్చింది. ఉర్దూ భాష గొప్పతనం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసివచ్చిందే మోకానీ, దాని గొప్పతనం యావత్ ప్రపంచం ఎప్పుడో గుర్తించిం ది. ఏవర్గం వారైనా వారిసంస్కృతిసంప్రదాయాలు పూర్తిగా మర్చి పోయి, పాలకులుఆడించినట్లు ఆడాలంటే ముందుగా నాయకులు చేసేపని వారిసంస్కృతిపై, భాషపై దాడిచేయడం.
ఇప్పుడు జగన్మో హన్ రెడ్డి అదేచేస్తున్నాడు. ముస్లింమైనారిటీల భాషైన ఉర్దూని మెల్లగా వారినుంచి దూరంచేయడానికే జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం కంకణంకట్టుకుంది. ఉర్దూభాషను రెండో అధికారభాష గా ఈముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటించేదేమిటి?
ఆంధ్రావాసుల హృదయాలను గెలుచుకొని, అభివృద్ధి మంత్రంతో రాష్ట్రాన్ని ప్రపం చపటంలో నిలిపిన చంద్రబాబుగారు గతంలోనే ఉర్దూని రెండోఅధి కారభాషగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉర్దూకళాశాలలు నిర్మించడ మేగాక, మౌలానా అబుల్ కలాంఅజాద్ గారిపేరుతో ఉర్దూ విశ్వ విద్యాలయాన్నే చంద్రబాబుగారు నిర్మించారు. అవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్ని ప్రాథమికపాఠశాలల్లో ఉర్దూభాష బోధ నకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు.
220 ప్రాథ మికపాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు ముగ్గురుచొప్పున ఉర్దూఅధ్యా పకులనునియమించారు. అప్పుడు వారికి రూ.7,500లు జీతమి చ్చిన చంద్రబాబు, మూడేళ్లతర్వాత పర్మినెంట్ చేస్తానని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఉపా ధ్యాయులందరినీ తొలగించారు. ఇంగ్లీషుపై మోజుతో ఈ ముఖ్యమంత్రి ఉర్దూభాషని తీవ్రంగా విస్మరించాడు. చివరకు రాష్ట్రంలోని అనేకపాఠశా లల్లో ఉర్దూబోధించేవారే లేకుండాపోయారంటే దానికి ఈ ముఖ్యమంత్రి కారకుడుకాదా?
రాష్ట్రం విభజించాక టీడీపీప్రభుత్వం ఏపీలో 4 ఉర్దూ కళాశాలలు నిర్మిస్తే, వాటిలో మూడు కళాశాలలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనాపరమైన కార్యాలయాలుగా మార్చడానికి సిద్ధమైంది. ఉర్దూ భాషకి, అదిమాట్లాడేవారికి ఏనాడూ ఎలాంటిసాయం చేయని జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడుభాషాభిమానం ఉరకలెత్తడం విచిత్రంగాఉంది.
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాను గతంలో చాలాసార్లు ఉర్దూ లైబ్రరీ కట్టించాలని, ప్రత్యేకంగా ఒకఉర్దూకళాశాల నిర్మించాలని విజ్ఞప్తిచేసినా ఆయనస్పందించలేదు. టీడీపీప్రభుత్వంలో ఉర్దూ అకాడమీ ఏర్పాటుకు రూ.500కోట్లుఖర్చుచేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక దానినిర్మాణానికి పైసా ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ బహిరంగంగా ఎక్కడైనా చెప్పడానికితాముసిద్ధంగా ఉన్నాము. తమతో చర్చకు రావడానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సిద్ధమా అనిప్రశ్నిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి, అంజాద్ బాషాలు పదవిలోకి వచ్చిన మూడేళ్లలో ఉర్దూభాషకోసం ఏంచేశారో, ఉర్దూ అకాడమీకి ఎందుకు నిధులివ్వలేదో సమాధానంచెప్పాలి. ఆఖరికి ఉర్దూ అకాడమీలోపనిచేసేవారికి జీతాలుకూడా ఇవ్వకుం డా ఈ ముఖ్యమంత్రి వారిని రోడ్డునపడేశాడు. ముస్లింల సంస్కృతి సంప్రదాయాలను నాశనంచేయడానికే ముఖ్యమంత్రి ఉర్దూభాష జపంచేస్తున్నాడుతప్ప, ఆభాషను ఉద్ధరించడానికి కాదు.
విజయవాడలో టీడీపీ హాయాంలోనిర్మించిన ఉర్దూకళాశాలలో సరైన వసతులు కల్పించడానికి ఈ ప్రభుత్వానికి మనసురాలేదు. జగన్మోహన్ రెడ్డిగానీ, అంజాద్ బాషాగానీ ఏనాడు ఆ భవనాన్ని సందర్శించి, అక్కడివారితో మాట్లాడిఏంకావాలని అడిగింది లేదు. జగన్మోహన్ రెడ్డి ముస్లింసమాజాన్ని ఏంఉద్ధరించాడని వైసీపీలోని మైనారిటీప్రతినిధులు ఆయనచిత్రపటాలకు పాలాభి షేకాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం.
మండలిఛైర్మన్ గాఉన్న షరీఫ్ని పెద్దవాడనే ఇంగితంకూడా లేకుండా తనపార్టీవారితో అనరాని మాటలుఅనిపించినందుకు, నీచాతినీచంగా సాయిబుకే పుట్టావా అని దుర్భాషలాడించినందుకు ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేయాలా? ఉర్దూకళాశాలను గాలికి వదిలేసినందుకా…లేక ఉర్దూ అకాడమీకి రూపాయికూడా నిధులు ఇవ్వనందుకా? లేక చంద్రబాబు ముస్లింలకు అమలు చేసిన అన్నిరకాల సంక్షేమపథకాలు అటకెక్కించినందుకా? లేక అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాంల కుటుంబాలను అతిదారుణంగా వైసీపీప్రభుత్వం పొట్టనపెట్టుకున్నందుకా?
ఉర్దూ అకాడమీలో పనిచేసేవారికి జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఉర్దూని ఉద్ధరిస్తా డా? అంజాద్ బాషా నోరుతెరిచి ముఖ్యమంత్రికి ఉర్దూగురించి అర్థ మయ్యేలా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఉర్దూ కళాశాలలు గతప్రభుత్వమే నిర్మించిందని, అక్కడ ఏవైనా మౌలికవసతులు కల్పిస్తే సరిపోతుందని అంజాద్ బాషా ఎందుకుచెప్పలేకపోయాడు ? జగన్మోహన్ రెడ్డి హాయాంలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు. ఆఖరికి ఈప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూములను కూడా కాజే యడానికి సిధ్ధమైంది. వైసీపీనేతలు వక్ప్ భూములు ఆక్రమించు కుంటున్నా ముఖ్యమంత్రి స్పందించడంలేదు.
మరలా చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం సమాజంలో సుఖసంతోషాలువెల్లివిరుస్తాయి. ఈమాట నేను అంటున్నదికాదు.. రాష్ట్రంలోని ముస్లిం సమాజంలో 80 శాతం మంది మరలాచంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమకు మంచిరోజులు వస్తాయని భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఉర్దూభాషపై అంతటి ప్రేమాభిమానాలే ఉంటే తెలుగుతో సమానంగా ఉర్దూని గౌరవించాలి. తెలుగుభాషా భివృద్ధికి కేటాయిస్తున్నట్లే ఉర్దూభాషకి నిధులు కేటాయించాలి. తెలుగు అకాడమీ మాదిరే ఉర్దూ అకాడమీని అభివృద్ధిచేయాలి.
తెలుగు భాష బోధన కోసం ఎలాగైతే పాఠశాలలు నిర్మిస్తున్నారో అదే విధంగా ఉర్దూభాషకి కూడా ప్రత్యేకంగా బోధనాకేంద్రాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి ఏం ఒరగబెట్టాడనే దానిపైగానీ, ఉర్దూభాషకుఏంచేశాడనే దానిపైగానీ తాము అంజాద్ బాషాతో బహిరంగచర్చకి సిద్ధంగా ఉన్నాము.