– ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల డేటాను విడుదల చేసిన కాగ్
గడచిన 10 నెలల్లో రాష్ట్ర ఆదాయం ₹80,000 కోట్లు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఋణాలు ₹58,703 కోట్లు.పది నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వేతనాలు, ఇతర బిల్లులు ₹34,989 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత పది నెలలో తీసుకున్న ఋణాలకు చెల్లించిన వడ్డీ ₹17,656 కోట్లు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ₹28,656 కోట్లు.ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకొన్న వేల కోట్లు అప్పులు ఇందుకు అదనం. రానున్న 12 నెలల్లో ₹37,029 కోట్ల రుణం తెస్తామని గత బడ్జెట్లో చెప్పి, పది నెలలకే ₹58,669 కోట్ల అప్పు తెస్తే… ఇక బడ్జెట్ సమావేశాలెందుకు? దానిపై చర్చ ఎందుకు? బడ్జెట్ ఆమోదం దేనికి.?? బడ్జెట్ను కూడా చిత్తు కాగితాలుగా ఈ ప్రభుత్వం మార్చేసిందన్నది ఆర్ధిక రంగ నిపుణుల విమర్శ.