– మధ్యాహ్న భోజన అనంతరం పిల్లలకు వాంతులు
– నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
– తల్లిదండ్రుల ఆందోళన
నంద్యాల లోని విశ్వనగర్ కాలనిలో ప్రభుత్వ ఎలిమెంట్రీ పాఠశాల లో మధ్యాహ్న భోజనం వికటించి, 42 మంది విద్యార్థులకు అస్వస్థత పాలయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న కాగా ఈ ఘటనపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందోనంటూ వార ంతా నంద్యాల ఆసుపత్రికి తరలివస్తున్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.