– కందుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన జేఏసీ
కందుకూరు నియోజకవర్గం ప్రకాశంజిల్లాలోనే ఉంచాలని.. డివిజన్ యధావిధిగా కొనసాగించాలని కోరుతూ గత 36 రోజులుగా చేస్తున్న దీక్ష పట్టణ ప్రజలకు తెలిసిందే. అయితే మా గోడు తెలిపేందుకు మాచే ఎన్నుకోబడిన ఎంపి ఆదాల కనుపడుటలేదు అని జేఏసి మరియు కందుకూరు ప్రజలు పట్టణ పోలీసు స్టేషనులో పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పట్టణ విశ్రాంత ఉద్యోగిని రమణమ్మ, జేఏసి నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మా ఎంపి ఆదాల కనుపడుటలేదని వెతికి పెట్టాలని పోలీసులను కోరారు. మా సమస్యలు చెప్పుదామంటే వినే నాధుడు కరువు అయ్యారని అవేదన వ్యక్తం చేశారు.కందుకూరు ను ప్రకాశంజిల్లాలో ఉండాలి అనే మా డిమాండ్ కు న్యాయం చేయాలని తాము ఎంత మంది నాయకులకు,అధికారులకు విన్నవించినా మాకు సరి ఆయిన రీతిలో స్పందించడం లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు జేఏసీ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, బెజవాడ ప్రసాదు,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.