-ఢిల్లీలో వైఎస్ఆర్ సిపి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం
– మాతృ శిశు మరణాలు రేటు సున్నాకు తగ్గాలా కృషి చేయాలి
– పెరిగిన ఎగుమతులు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీచేయగల సత్తా కల్గిన పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారద్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రదాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారని, జనమే ఆయన బలమని అన్నారు.
ఢిల్లీలోని 201/C విపి హౌస్ లో బుధవారం వైఎస్ఆర్ సిసి రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం ఘణంగా జరిగిందని అన్నారు. పార్టీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహణ కల్పించడంతో పాటు రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలను పార్లమెంటులో లేవనెత్తడంలో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. కార్యక్రమానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీ లు పాల్గొన్నారని తెలిపారు.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు కారణంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాల్లో మాతృమరణాలు ఘణనీయంగా తగ్గముఖం పట్టాయని, 2030 నాటికి మాతృమరణాల రేటు లక్ష సజీవ పుట్టుకలకు 70కి తగ్గుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ లో పేర్కొందని అన్నారు. 2016-18 నాటికి మాతృమరణాల రేటు 113(ఒక లక్ష సజీవ పుట్టుకలకు) ఉందని, 2017-19 నాటికి 103 (ఒక లక్ష సజీవ పుట్టుకలకు) కి తగ్గిందని అన్నారు. మాతా శిశు మరణాల రేటు స్థిరంగా తగ్గుముఖం పట్టడంలో వైద్యశాఖ మరియు అనుబంధ శాఖల పనితీరు ప్రశంసనీయమైనప్పటికీ మరణాల రేటు సున్నాకు తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే, 2021-22 ఏప్రిల్-ఫిబ్రవరిల మద్య దేశంలో అన్నిరకాల ఎగుమలు కలిపి 36.19% పెరిగి $601.77 బిలియన్లకు చేరుకుందని అంచనా వేయడం జరిగిందని అన్నారు. ఆశాజనకంగా మారిన ఎగుమతుల పెరుగుదల కారణంగా మన ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపడుతుందని అన్నారు. దేశంలో ఎగుమతులు పెరగడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్రపోషిస్తుందని అన్నారు.