అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ ను అమలు చేస్తామని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, వారి పనితీరును గమనించిన సీఎం జగన్ జూన్ నెలలో ప్రోబెషన్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు.
ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని,ఈ మధ్య కొంతమంది కార్యదర్శులను, సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టారని అన్నారు. వారికి ప్రోబెషన్ ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదంటూ కొందరు నిరసనలు కూడా తెలిపారని అన్నారు.ఇదే క్రమంలో సీఎం వైయస్ జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రొబేషన్ పై స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు.