– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారు.విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ బిజెపి వల్లనే సాధ్యమైంది.
కోనసీమ రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టక పోవడంతో బిజెపి మాత్రమే ఉద్యమం చేస్తోంది. అదేవిధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతాయా ని ప్రకటించారు అంటే కడప-బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించేవిధంగా ఉద్యమిస్తాం.ఆంధ్రప్రదేశ్ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగు తోందని ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.