– ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7వ తారీకు ఉదయం 10 గంటలకు నరసరావపేట రానున్నారని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం పర్యటన వివరాలు వివరించారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 6 న జరగాల్సిన వాలంటీర్లు సన్మాన కార్యక్రమం 7న జగరనున్నట్లు స్పష్టం చేశారు.
ఎస్ఎస్ఎన్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్టేడియంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ప్రముఖులు రానున్నారు అని తెలిపారు. వాలంటీర్లు. అధికారులు, సచివాలయం సిబ్బంది అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. అందరూ 9.30 కు స్టేడియం లో ఉండాలని కోరారు. పాసుల విధానం ఏమి లేదని స్పష్టం చేశారు. వీఐపీ మార్గం ఏదైతే ఉందో.. SSN కాలేజ్ రోడ్డు, మల్లమ్మ సెంటర్, సత్తెనపల్లి రోడ్డు, స్టేడియం మార్గంలో ఎవరు వచ్చే ప్రయత్నం చేయవద్దు అని సూచించారు.
గేట్ నంబర్ 2 నుంచి అందరూ లోనికి రావాలని కోరారు. విశాలమైన పార్కింగ్ తో పాటు.. వీలైనంత ఎక్కువ మందిని స్టేడియం వద్ద దింపి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు.సీఎం పల్నాడు జిల్లా ఏర్పడిత తరవాత.. మొట్టమొదటిసారి నరసరావుపేటకు రావడం జరుగుతున్న నేపథ్యంలో.. పల్నాడు ప్రజలు అంతా 56 ఏళ్ల కలను నెరవేర్చిన సీఎం కి ధన్యవాదాలు తెలపాలి అని కోరారు.